బైకుల అమ్మకాలు ఢమాల్‌

13 Jun, 2021 09:19 IST|Sakshi

మేలో 56 శాతం పడిపోయిన సేల్స్‌

నేల చూపులు చూసిన స్కూటర్‌ అమ్మకాలు

త్రీ వీలర్‌ సెగ్మెంట్‌లోనూ అదే పరిస్థితి

వెబ్‌డెస్క్‌ : లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో బైకుల అమ్మకాలు మేలో ఢమాల్‌ అన్నాయి. ఒక్కసారిగా అమ్మకాలు సగానికి సగం పడిపోయాయి. కరోనా సంక్షోభంతో దేశవ్యాప్తంగా దాదాపు అన్ని స్టేట్స్‌లో లాక్‌డౌన్‌ అమలు చేశారు. దీంతో టూ వీలర్‌ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. ది ఫేడరేషన్‌ ఆఫ్‌ ఆటో మొబైల్ డీలర్‌ అసోసియేషన్స్‌ (ఫెడా) తాజా గణాంకాలు ఇదే విషయం తెలియజేస్తున్నాయి. 

56 శాతం
లాక్‌డౌన్‌ అమల్లోకి రాకముందు ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా టూ వీలర్స్‌ మార్కెట్‌ ఆశాజనకంగా ఉంది. 2021 ఏప్రిల్‌లో   6,67,841 యూనిట్లు అమ్ముడయ్యాయి. మేలో ఈ సంఖ్య 2,95,257కి పడిపోయింది. ప్రత్యేకించి స్కూటర్‌ అమ్మకాలు మరీ దారుణంగా పడిపోయాయి. ఏప్రిల్‌లో అమ్ముడుపోయిన యూనిట్ల సంఖ్య 3,00,462 ఉండగా మే వచ్చే సరికి ఈ సంఖ్య 50,294కి పడిపోయింది. మొత్తంగా టూ వీలర్‌ అమ్మకాల్లో 56 శాతం క్షీణత నమోదు అవగా స్కూటర్‌ సెగ్మెంట్‌లో 83 శాతం క్షీణత నమోదైంది. 

ఆటో అమ్మకాలు ఇలా
ఆటో అమ్మకాలపై కూడా లాక్‌డౌన్‌ ప్రభావం పడింది. ఏప్రిల్‌లో 13,728 యూనిట్లు అమ్ముడు కాగా మే వచ్చే సరికి 1,251 యూనిట్లు అమ్ముడయ్యాయి. మొత్తంగా 91 శాతం అమ్మకాలు పడిపోయాయి. 

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ - రాజేశ్‌ మీనన్‌ (డైరెక్టర్‌ జనరల్‌) సోసైటీ ఆఫ్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌
దేశవ్యాప్తంగా మేలో లాక్‌డౌన్‌ నిబంధనలు అమల్లో ఉన్నాయి. దాని ప్రభావం ఆటో మొబైల్‌ పరిశ్రమపై పడింది. చాలా కంపెనీలు తయారీ యూనిట్లు మూసేశాయి. షోరూమ్‌లు తెరిచే అవకాశం లేకుండా పోయింది. అందువల్లే అమ్మకాలు బాగా తగ్గాయి. 

చదవండి: తగ్గనున్న టూ వీలర్‌ ధరలు.. ఈవీలపై సబ్సిడీ పెంపు

మరిన్ని వార్తలు