పేలుతున్న స్మార్ట్‌వాచ్‌లు, కాలిపోతున్న యూజర్ల చేతులు!

1 May, 2022 19:19 IST|Sakshi

ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. ఉత్తర కాలిఫోర్నియాలోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో ఇద్దరు మహిళలు గూగుల్‌పై దావా వేశారు.  గూగుల్‌కు చెందిన స్మార్ట్‌ వాచ్‌లు ధరించడం వల్ల తమ చేతులు కాలిపోయాంటూ యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో వేసిన దావాలో పేర్కొన్నారు.

 గూగుల్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా 'ఫిట్‌బిట్‌' పేరుతో స్మార్ట్‌ వాచ్‌లను విడుదల చేసింది. ఏప్రిల్‌ 2018న ఫిట్‌ బిట్‌ వెర్సా 1, 2019 సెప్టెంబర్‌లో ఫిట్‌బిట్‌ వెర్సా 2, 2020 సెప్టెంబర్‌లో  ఫిట్‌బిట్‌ వెర్సా 3ని విడుదల చేసింది. విడుదలైన ఈ స్మార్ట్‌వాచ్‌లు గూగుల్‌ సంస్థవి కావడంతో యూజర్లు సైతం వాటిని ధరించేందుకు మొగ్గుచూపారు. 

ఫలితంగా స్మార్ట్‌ వాచ్‌లను వినియోగించిన యూజర్లు చేతులు కాలి తీవ్రంగా గాయపడుతున్న వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వాచ్‌లో ఉండే లిథియం అయాన్‌ బ్యాటరీలు హీటెక్కీ పేలిపోవడంపై వరుస ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ ఏడాది మార్చి నెలలో యూజర్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నాసిరకం10మిలియన్‌ల  ఫిట్‌బిట్‌ వాచ్‌లను వెంటనే రీకాల్‌ చేయాలని హెచ్చరింది. దీంతో కన్జ్యూమర్‌ సేఫ్టీ కమిషన్‌ హెచ్చరికలతో కంగుతిన్న గూగుల్‌ ఆ వాచ్‌లను రీకాల్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం..జెన్నీ హౌచెన్స్, సమంతా రామిరేజ్ యూఎస్‌ డిస్ట్రిక్‌ కోర్ట్‌ను ఆశ్రయించారు. ఫిట్‌బిట్‌ స్మార్ట్‌ వాచ్‌ వెర్సాలైట్‌ మోడల్‌ను ధరించిన తన కుమార్తె చేయి కాలిపోయిందని జెన్నీ హౌచెన్స్‌, వెర్సా 2 స్మార్ట్‌ వాచ్‌ ధరిండం వల్ల తాను గాయపడినట్లు రామిరేజ్‌ గూగుల్‌పై వేసిన దావాలో పేర్కొన్నారు. అంతేకాదు ఇద్దరూ తమ ఫిట్‌బిట్‌ల ధర వాపస్‌ తో పాటు చట్టపరమైన ఖర్చులను తిరిగి చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా..బాధితుల తరుపు న్యాయ వాదులు కేలరీలను బర్న్ చేయడానికి స్మార్ట్‌వాచ్‌లను కొనుగోలు చేస్తారు. కానీ ఇలా చేతుల్ని కాల్చుకునేందుకు కాదంటూ కోర్ట్‌లో వాదించారు.

చదవండి👉గూగుల్‌కు భారీషాక్‌..అమ్మ బాబోయ్‌!! ఈ స్మార్ట్‌ వాచ్‌తో చేతులు కాలిపోతున్నాయ్‌!!

మరిన్ని వార్తలు