తెలంగాణలో మరో ఈవీ స్కూటర్ల తయారీ పరిశ్రమ

13 Jun, 2022 14:00 IST|Sakshi

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి చెందిన మెటా 4 సంస్థ తెలంగాణలో ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ కర్మాగారం ఏర్పాటు చేయనుంది. తెలంగాణలోని జహీరాబాద్లో 15 ఎకరాల విస్తీర్ణములో రూ. 250 కోట్ల పెట్టుబడితో ఫ్యాక్టరీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 2022-23 ఆఖరుకల్లా ఇక్కడ ఉత్పత్తి ప్రారంభం కానుంది. దీంతో పాటు వోల్టీ ఎనర్జీ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఛార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. మంత్రి కేటీఆర్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయిన తర్వాత మొదటి ఏడాది 40 వేల ద్విచక్ర వాహనాలు తయారవుతాయని మెటా4 తెలిపింది. ఆ తర్వాత రాబోయే మూడేళ్లలో ఫ్యాక్టరీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం లక్షకు చేరుకుంటుందని వెల్లడించింది. ఈవీ టూవీలర్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి తెలంగాణను ఎంచుకుంచున్నందుకు మెటా4, వోల్టీ ఎనర్జీ సంస్థలకు మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. త్వరలో ఈవీ మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీలకు తెలంగాణ హబ్‌గా మారబోతుందన్నారు.

చదవండి: ప్రపంచంలో తొలి సోలార్‌ పవర్‌ కారు.. విశేషాలు ఇవే


 

మరిన్ని వార్తలు