ఉబర్‌లో ప్రయాణిస్తుంటారా? అయితే ఇది మీకోసమే

30 Nov, 2022 21:28 IST|Sakshi

ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఉబర్‌ ప్రయాణికులకోసం సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.ముఖ్యంగా ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఈ ఫీచర్లను యూజర్లకు పరిచయం చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. 

బుక్‌ చేసుకున్న ప్రయాణికులు ఉబర్‌ క్యాబ్‌ ఎక్కిన వెంటనే డ్రైవర్‌ ఫోన్‌ నుంచి వారికి సీటు బెల్టు పెట్టుకోండి అంటూ ఓ పుష్‌ నోటిఫికేషన్‌ వస్తుంది. అలాగే, మీరు ఎక్కడ ఉన్నారనేది తెలిపిలా లైవ్‌ లొకేషన్‌ సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందేలా ఎస్‌ఓఎస్‌ ఇంటిగ్రేషన్‌ను ప్రారంభించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. 

ఇక డ్రైవర్‌తో ఏదైనా సమస్య, వెహికల్స్‌లో అసౌకర్యంగా ఉంటే వెంటనే  కస్టమర్‌కేర్‌తో మాట్లాడేందుకు సేఫ్టీలైన్‌ వినియోగంలోకి తెచ్చింది. దీంతో పాటు భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఉబర్‌ యాప్‌ ద్వారా 88006 88666 నంబర్‌కు డయల్‌ చేయొచ్చని కంపెనీ తెలిపింది. 30 సెకన్లలోపే కంపెనీ ప్రతినిధి అందుబాటులోకి వస్తారని పేర్కొంది.

మరిన్ని వార్తలు