Book Cab In WhatsApp: వాట్సాప్ నుంచి క్యాబ్ బుక్ చేసుకోవచ్చు.. ఎలా అంటే?

2 Dec, 2021 20:51 IST|Sakshi

వాహన ప్రయాణికులకు శుభవార్త. చేతిలో ఊబెర్‌ షేరింగ్‌ యాప్‌ లేకపోయినా వాట్సాప్‌ ఆన్‌లో ఉంటే చాలు ఇకపై ఊబెర్‌ క్యాబ్స్‌ను బుక్‌ చేసుకోవచ్చని' ఊబెర్‌ ప్రతినిధులు తెలిపారు. ప్రపంచంలోనే తొలిసారి మనదేశంలో ఈ తరహా క్యాబ్‌ సర్వీసుల్ని ఊబెర్‌ అందించనుంది.  ఇందుకోసం వాట్సాప్​తో ఒప్పందం కుదుర్చుకుంది. 

రైడ్‌ షేరింగ్‌ సంస్థ ఊబెర్‌ సరికొత్త రైడ్‌ షేరింగ్‌ సర్వీసుల్ని అందుబాటులోకి తెచ్చింది. ఊబెర్‌ యాప్‌ లేకుండా ఊబెర్‌ లోని ​చాట్ బోట్​తో కనెక్టై సులభంగా క్యాబ్​ బుక్​ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ సేవలు పైలెట్​ ప్రాజెక్టుగా ఉత్తరప్రదేశ్​ రాజధాని లక్నో లోనే ప్రారంభించారు. త్వరలో దేశం మొత్తం విస్తరించేందుకు ఊబెర్‌ ప్రతినిధులు ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు.   

వాట్సాప్‌తో క్యాబ్‌ ఎలా బుక్‌ చేసుకోవాలి
వాట్సాప్​ యూజర్లు మొత్తం మూడు మార్గాల ద్వారా ఉబెర్​ క్యాబ్‌ను బుక్ చేసుకోవచ్చు. లేదంటే క్యూఆర్​ కోడ్‌ని స్కాన్ చేసి ఉబెర్​ వాట్సాప్​ చాట్‌ లింక్​పై క్లిక్​ చేస్తే బుకింగ్‌ ఓపెన్‌ అవుతుంది. అక్కడే పికప్‌, డ్రాప్‌ లొకేషన్‌తో పాటు ఫేర్‌ ప్రైస్‌, క్యాబ్‌ ఎప్పుడు అందుబాటులో ఉంటుందనే వివరాలు డిస్‌ప్లే అవుతాయి. ఫైనల్‌గా మీరు ‘బుక్​ ఎ రైడ్’ పై క్లిక్‌ చేసి క్యాబ్‌ బుక్‌ చేసుకోవచ్చు.   

చదవండి: ‘ఆధార్‌ కార్డు’ మోడల్‌..! ప్రపంచ వ్యాప్తంగా...!

మరిన్ని వార్తలు