Uber CEO: రోజంతా డెలివరీలతో ఎంత సంపాదించాడంటే..

28 Jun, 2021 11:42 IST|Sakshi

ప్రొఫెషనల్‌ డిగ్నిటీ, వృత్తిలో నైతిక విలువలు, పనిలో కష్టపడేతత్వం.. వీటికి తోడుగా అదృష్టం మనిషిని సక్సెస్‌ఫుల్‌ పర్సన్‌గా నిలబెడతాయి. సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ.. ఉబెర్‌ సీఈవో దారా ఖోస్రోషాహికి శ్రమ అంటే చాలా ఇష్టం.అందుకే అప్పుడప్పుడు గ్రౌండ్‌ లెవల్‌లోకి దిగి.. తోటి వర్కర్ల పనితీరును పర్యవేక్షిస్తుంటాడు. సరదాగా వాళ్లతో ఔటింగ్‌లకూ వెళ్తుంటాడు.

అలాంటి వ్యక్తి ఈ మధ్య ఆయన స్వయంగా ఫుడ్‌ డెలివరీలు చేశాడు. అదీ సైకిల్‌ మీద తిరుగుతూ. ఆదివారం ఈ విషయాన్ని ఆయన తన ట్విటర్‌ ద్వారా తెలియజేశాడు. శాన్‌ ఫ్రాన్సిస్కోలో సైకిల్‌ మీద ఉన్న ఫొటోను షేర్‌ చేసి.. టైం టు టైం అప్‌డేట్‌ పంచుకున్నాడు. పైగా  డెలివరీల ద్వారా ఆరోజులో దాదాపు 100 డాలర్లు సంపాదించినట్లు వెల్లడించాడు. ఇక ఎలా సంపాదించారని కొందరు అడగ్గా.. ఒక్కో ఆర్డర్‌ మీద 6 నుంచి 23 డాలర్లు సంపాదించానని చెప్పుకొచ్చాడు.

పది ట్రిప్పులతో 98.91 డాలర్లు సంపాదించిన స్క్రీన్ షాట్ ఆయన షేర్‌ చేశాడు. ఇక పాజిటివ్‌ ఉన్నట్లే ఈ వ్యవహారంలో నెగెటివిటీ మొదలైంది. పబ్లిసిటీ స్టంట్‌ అదిరిందంటూ 52 ఏళ్ల దారా ఖోస్రోషాహిని కొందరు హేళన చేస్తున్నారు. ఇక ఇంకొందరు ఉబెర్‌ ఈట్స్‌ సర్వీసును పొగుడుతూనే.. ఆ వర్కర్లను మనుషుల్లా చూడడం నేర్వండంటూ దారాకి చురకలంటించారు.


చదవండి: భారతీయులకు ఉబెర్‌ సీఈవో హెచ్చరిక

మరిన్ని వార్తలు