ఉబర్ రైడ్ చేసే కస్టమర్లకు గుడ్ న్యూస్..!

17 Feb, 2022 16:23 IST|Sakshi

ప్రముఖ మొబిలిటీ ప్లాట్ ఫామ్ ఉబర్ కస్టమర్స్ కోసం సరికొత్త ఫీచర్లతో  ముందుకు వచ్చింది. దీంతో కస్టమర్లు తమ రేటింగ్స్ ను తెలుసుకునే అవకాశం కలగనుంది.

కొత్త అప్డేట్...
సాధారణంగా ఉబర్ లో ఆయా కస్టమర్ ప్రయానించినప్పుడు సదరు ట్రిప్ పై డ్రైవర్ కు  రేటింగ్ ఇస్తూ ఉంటారు. ఐతే సదరు డ్రైవర్ కూడా రైడ్ పూర్తిచేసిన వారికి కూడా రేటింగ్ ఇస్తారు. ఇది ఆయా కస్టమర్స్ కు కనిపించదు. కాగా ఉబర్ ఇప్పుడు తాజాగా తెచ్చిన ఫీచర్ తో ఇకపై సదరు డ్రైవర్ కస్టమర్ కు ఇచ్చిన రేటింగ్ కనిపించనుంది.   రైడర్‌లు తమ డ్రైవర్ల నుంచి ఎన్ని ఫైవ్-స్టార్ రేటింగ్‌లు లేదా వన్-స్టార్ రేటింగ్‌లు అందుకున్నారో ఇప్పుడు చూడగలుగుతారని ఉబర్ బుధవారం ప్రకటించింది.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్‌లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తోంది.

అటు డ్రైవర్లకు కస్టమర్స్ కు...
డ్రైవర్లకు, కస్టమర్లకు దృష్టిలో వుంచుకుని ఉబర్ ఈ ఫీచర్ ను తెచ్చింది.  డ్రైవర్ల నుంచి సదరు రైడర్ వారు అందుకున్నా రేటింగ్ గల కారణాన్ని కూడా చూడవచ్చు. కాగా ఉబర్లో ప్రయాణించేటప్పుడు సదరు వాహనాన్ని శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత కస్టమర్ది.  ఉబర్  రైడర్‌లు,  డ్రైవర్‌లు ఒకరికొకరు అభిప్రాయాన్ని తెలియజేసుకోవడానికి సంవత్సరాలుగా కొత్త మార్గాలపై కంపెనీ పని చేస్తోంది. ఇక 2017లో డ్రైవర్ ప్రవర్తనపై ఫీడ్‌బ్యాక్‌ను అందించే వీలును ఉబర్  కస్టమర్లకు అందించింది.

>
మరిన్ని వార్తలు