Aadhaar Services at Your Doorstep: ఆధార్‌ కార్డ్‌ వినియోగదారులకు శుభవార్త!

12 Jun, 2022 17:16 IST|Sakshi

ఆధార్‌ కార్డ్‌ వినియోగదారులకు శుభవార్త. ఐడీఏఐ సంస్థ ఆధార్‌ ఆధారిత సేవల్ని వినియోగదారులకు ఇంటి వద్ద నుంచి అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 


ఆధార్‌ కార్డ్‌లో కాంటాక్ట్‌ నెంబర్‌ను యాడ్‌ చేయాలన్నా, లేదంటే పిల్లల పేర్లు జత చేయాలన్నా, ఇతర వ్యక్తిగత వివరాల్ని పొందుపరచలన్నా ఆధార్‌ సెంటర్‌కు ఉరుకులు పరుగులు తీయాల్సి వచ్చేది. ఒక్కోసారి వ్యయప్రాయాసలు గూర్చి ఆధార్‌ సెంటర్‌కు వెళ్లినా భారీ క్యూలు, సర్వర్‌ సమస్యలతో వెనక్కి తిరిగి వచ్చే పరిస్థితి నెలకొనేది. ఈ సమస్యలకు పరిష్కార మార్గంగా యూఐడీఏఐ డోర్‌-టూ- డోర్‌ ఆధార్‌ సర్వీస్‌ సేవల్ని అందించాలని భావిస్తుంది. అదే జరిగితే ఆధార్‌ సెంటర్‌కు వెళ్లే  అవసరం తీరిపోనుంది. 

48000 పోస్ట్‌ మెన్‌లు 
వినియోగదారులకు ఇంటి వద్ద నుంచే, ప్రత్యేకంగా రిమోట్‌ ఏరియాల్లో ఆధార్‌ సేవల్ని అందించేందుకు యూఐడీఏఐ ప్రస్తుతం పోస్టాఫీస్‌కు సంబంధించిన 48వేల మంది పోస్ట్‌ మెన్‌లకు ట్రైనింగ్‌ ఇస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 
 
1.5లక్షల మందికి పైగా 
అదే సమయంలో 2 దశల్లో 1.5లక్షల మందికి పైగా ఆధార్‌ డిజిటల్‌ ఎక్విప్‌మెంట్‌ ల్యాప్‌ ట్యాప్‌ బేస్డ్‌ ఆధార్‌ కిట్‌లపై ట్రైనింగ్‌ ఇవ్వనుంది. 

13వేల మంది ఉద్యోగులు 
కేంద్ర ప్రభుత్వ సంస్థ మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగానికి చెందిన 13వేల మంది ఉద్యోగులు సైతం ఆధార్‌ సేవల్ని అందించనున్నారు.

773జిల్లాల్లో 
ఏప్రిల్‌ 4,2022 వీకీపిడియా లెక్కల ప్రకారం..మనదేశంలో ఉన్న మొత్తం 773జిల్లాల్లో ఆధార్‌ సేవా కేంద్రాల్ని ఏర్పాడు చేయాలని యూఐడీఏఐ భావిస్తోంది. తద్వారా వినియోగదారులు తమ సేవల్ని సత్వరమే ఉపయోగించుకోవచ్చని అంచనా వేస్తోంది.

మరిన్ని వార్తలు