Aadhaar Services: ఈ రెండు ఆధార్ సేవలు నిలిపివేసిన యూఐడీఏఐ

24 Aug, 2021 18:14 IST|Sakshi

మన దేశంలో చిన్న పిల్లవాడి నుంచి 60 ఏళ్ల వృద్ధుడి వరకు ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా ఇప్పుడు ఆధార్ కార్డు కలిగి ఉండాల్సిందే. ఇది అన్నింటిలో ముఖ్యమైన గుర్తింపు పత్రంగా ఉపయోగపడుతుంది. పాస్ పోర్టు కోసం ధరఖాస్తు చేసుకోవాలన్న, కొత్త బ్యాంకు అకౌంట్ తీసుకోవాలన్న ఆధార్ కార్డు అవసరం. ఇలాంటి ముఖ్యమైన ఆధార్ కార్డులో పేరు, చిత్రం, చిరునామా వంటి మొదలైన వివరాలను అప్ డేట్ చేయడం కోసం యూఐడీఏఐ అనేక సేవలను ఆన్ లైన్ చేసింది. అయితే, ఈ మధ్య కాలంలో ఆధార్ కార్డుతో ముడిపడి ఉన్న రెండు సేవలను యూఐడీఏఐ నిలిపివేసింది. అవి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. (చదవండి: ఎల్ఐసీ పాలసీదారులకు శుభవార్త!)

  • ఆధార్ కార్డులో మీ చిరునామాను అప్ డేట్ చేయడం కోసం చిరునామా ధ్రువీకరణ లేఖ పంపించేది. ఆ లేఖలో ఒక సీక్రెట్ కోడ్ ఉంటుంది. అందులో ఉన్న కోడ్ వివరాలను నమోదు చేసిన తర్వాత మీ చిరునామా మార్పు జరిగేది. అయితే, గత కొంత కాలంగా చిరునామాను అప్ డేట్ చేసేటప్పుడు చిరునామా ధ్రువీకరణ లేఖ ఎంపికను యూఐడీఏఐ పోర్టల్ నుంచి తొలగించింది.
  • ఆధార్ కార్డుదారులు రి ప్రింట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు గతంలో ఒక పెద్ద పేపర్ మీద మీ వివరాలు వచ్చేవి. ఇప్పుడు ఆ సదుపాయాన్ని నిలిపివేసింది. అందుకు బదులుగా యూఐడీఏఐ ప్లాస్టిక్ ఆధార్ కార్డులను మాత్రమే జారీ చేస్తుంది.
     
>
మరిన్ని వార్తలు