Ujjwala Scheme 2.0: గ్యాస్‌ వినియోగదారులకు కేంద్రం శుభవార్త

10 Aug, 2021 13:33 IST|Sakshi

గ్యాస్‌ వినియోగదారులకు కేంద్రం శుభవార్త. ఉజ్వల 2.0 పథకం కింద లబ్దిదారులకు ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లు అందించే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో పీఎంయూవై పథకం కింద మరో కోటి గ్యాస్‌ కనెక్షన్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తొలి విడతలో ఎల్‌పీజీ కనెక్షన్లు పొందలేక పోయిన పేద కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లను అందించాలని  నిర్ణయించింది.

ఇందులో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మహోబా జిల్లాలో జరిగిన కార్యక్రమాన్ని ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఉజ్వల 2.0లో యూనియన్‌ పెట్రోలియం మినిస్టర్‌ హర్దీప్‌ సింగ్‌ పూరి, ఉత్తర్‌ ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాధ్‌, డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యాలు పాల్గొన్నారు.

ఈ పథకంలో భాగంగా ఉజ్వల 2.0 కింద ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్‌తో పాటు లబ్ధిదారులకు మొదటి రీఫిల్, హాట్‌ప్లేట్ అందించనున్నట్లు కేంద్రం తెలిపింది. ఇదిలా ఉంటే.. ఉజ్వల స్కీమ్‌లో రిజిస్ట్రేషన్ కోసం కనీస ప్రతాలు అవసరమే కానీ ఉజ్వల 2.0లో వలసదారులు రేషన్‌కార్డు, నివాస ధ్రువీకరణ పత్రాలు లేకుండానే గ్యాస్ కనెక్షన్లు అందించనుంది. కాగా ఉజ్వల 1.0 కార్యక్రమాన్ని మే1, 2016న ప్రధాని మోదీ ఉత్తర్‌ ప్రదేశ్‌ బల్లియా నుంచి ప్రారంభించారు. తొలివిడుతలో 80లక్షల ఎల్పీజీ గ్యాస్‌ కనెక్షన్లను అందించిన విషయం తెలిసిందే.   

మరిన్ని వార్తలు