OnlyFans: మొన్న బ్యాన్‌ ప్రకటన.. ఇప్పుడు అశ్లీల కంటెంట్‌కు రైట్‌ రైట్‌!

26 Aug, 2021 10:05 IST|Sakshi

OnlyFans Reverse Ban Decision: అశ్లీల కంటెంట్‌తో దూసుకుపోతున్న వెబ్‌సైట్‌ ఓన్లీఫ్యాన్స్‌ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ సైట్‌లో అడల్ట్‌ కంటెంట్‌కు చోటు ఉండదని ప్రకటించిన కొన్ని గంటలకే.. మాట మార్చేసింది. అన్నిజానర్ల కంటెంట్‌కు తమ వెబ్‌సైట్‌లో చోటు ఉంటుందంటూ సె*వర్కర్లకు బహిరంగ మద్దతుతో ఓ ప్రకటన రిలీజ్‌ చేసింది. 

బ్యాకింగ్‌ పార్ట్‌నర్స్‌, పే అవుట్‌ ప్రొవైడర్స్‌ విజ్ఞప్తుల మేరకు అక్టోబర్‌ 1 నుంచి తమ వెబ్‌సైట్‌లో అశ్లీల కంటెంట్‌కు చోటు ఉండబోదని ప్రకటించింది ఓన్లీఫ్యాన్స్‌. అయితే ఈ నిర్ణయంపై తీవ్ర దుమారం చెలరేగింది. పెద్ద ఎత్తున్న అభ్యంతరాలు వ్యక్తం కావడంతో బుధవారం సాయంత్రం మరో ప్రకటన రిలీజ్‌ చేసింది. బ్యాకింగ్‌ పార్ట్‌నర్స్‌ మద్దతుతోనే ముందుకెళ్తామని ప్రకటించడం గమనార్హం.  

ఓన్లీ ఫ్యాన్స్‌ అనేది యూకేకు చెందిన పెయిడ్‌ సబ్ స్క్రిప్షన్ సర్వీస్‌. ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా కంటెంట్‌ క్రియేటర్లు.. నేరుగా తమ కంటెంట్‌ను కస్టమర్లకు అమ్ముకోవచ్చు. తద్వారా క్రియేటర్లకు ఆదాయం.. మరోవైపు వెబ్‌సైట్‌కు, కస్టమర్ల పేమెంట్‌ ద్వారా బ్యాకింగ్‌ పార్ట్‌నర్స్‌కు అందులో కొంత వాటా వెళ్తుంది.  

ప్రారంభంలో సెలబ్రిటీ యూజర్ల వల్ల డీసెంట్‌ సైట్‌గా పేరు దక్కించుకున్న ఓన్లీఫ్యాన్స్‌.. ఆ తర్వాతి కాలంలో సెక్స్‌వర్కర్ల ఎంట్రీతో అశ్లీల వెబ్‌సైట్‌ అనే ముద్ర వేయించుకుంది. కంటెంట్‌ ఓన్లీఫ్యాన్స్‌కు గ్లోబల్‌ వైడ్‌గా 130 మిలియన్ల యూజర్లు ఉండగా.. భారత్‌ నుంచి సుమారు మూడున్నర లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. 

అభ్యంతరాలు ఇవే..
ఆన్‌లైన్‌ పో* పరిశ్రమ బిలియన్ల వ్యాపారం నడుస్తుండడంతో పాటు నేరాలు బాగా తగ్గాయి. ముఖ్యంగా కరోనా టైం ఈ సైట్‌లో ఎరోటిక్‌ కంటెంట్‌కు ఫుల్‌ గిరాకీ ఉంటోంది. అయితే ఇలాంటి అడల్ట్‌ కంటెంట్‌ క్రియేట్‌ వెబ్‌సైట్‌పై నిషేధాలు విధిస్తే మళ్లీ సె*వర్కర్లంతా రొడ్డెక్కుతారని, తద్వారా క్రైమ్‌ రేటు పెరిగే అవకాశాలు ఉంటాయని మానవ హక్కుల సంఘాలు వాదిస్తున్నాయి. అంతేకాదు తమ ఉపాధిపై దెబ్బపడుతుందని, భద్రతకు సంబంధించి ఆందళోన వ్యక్తం చేస్తున్నారు సె*వర్కర్లు.

చదవండి: అశ్లీల వెబ్‌సైట్లు.. సబ్‌స్క్రిప్షన్‌కు కార్డులూ పని చేయవు

>
మరిన్ని వార్తలు