ఉక్రెయిన్‌ సంక్షోభం.. ఎగుమతుల్లో ఇండియా రికార్డ్‌!

11 May, 2022 13:28 IST|Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా దాడితో తలెత్తిన సంక్షోభ సమయంలో ప్రపంచ దేశాలకు ఆహార కొరత రాకుండా భారత్‌ అండగా నిలుస్తోంది. రికార్డు స్థాయిలో గోదుమలు ఎగుమతి చేస్తూ యుద్ధ ప్రభావం పలు దేశాలపై తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది.

 ప్రపంచంలోనే గోధుమల దిగుమతిలో రెండో స్థానంలో భారత్‌ ఉంది. మొదటి స్థానంలో రష్యా ఉంది. అయితే రష్యా యుద్ధంలో తీరిక లేకుండా ఉండటం, మరోవైపు రష్యా నుంచి దిగుమతుల విషయంలో ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించడంతో చాలా దేశాలు గోదుమల కొరతను ఎదుర్కొంటున్నాయి. ప్రత్యామ్నాయంగా భారత్‌ వైపు చూస్తున్నాయి.

గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో భారత్‌ ప్రపంచ దేశాలకు 2.42 లక్షల టన్నుల గోదుమలు ఎగుమతి చేయగా ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధ ప్రభావం వల్ల ఈ ఏడాది ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో ఏకంగా 14 లక్షల టన్నుల గోదుమలను ఎగుమతి చేయగలిగింది. అంతేకాదు మేలో ఏకంగా 15 లక్షల టన్నుల గోదుమలు ఎగుమతి చేసేందుకు రెడీ అయ్యింది. 

ఇండియా నుంచి భారీ ఎత్తున గోదుమలు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో ఈజిప్టు ప్రథమ స్థానంలో ఉండగా ఇజ్రాయిల్‌, టర్కీ, ఇండోనేషియా వంటి ఏషియా దేశాలు, మొజాంబిక్‌, టాంజానియా వంటి నార్త్‌ ఆఫ్రికా దేశాలు ఉన్నాయి. వీటితో పాటు ఐక్యరాజ్య సమితి తరఫున కెన్యా, సోమాలియా, జిబోటీ వంటి దేశాలకు సరఫరా చేస్తోంది. గోదుమలతో పాటు ఇతర ఆహారా ధాన్యాలను భారీ ఎత్తున ఇండియా ఎగుమతి చేస్తోంది. 

చదవండి: బ్రిటన్‌–భారత్‌ పరిశ్రమల టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు

మరిన్ని వార్తలు