అమెరికా చెప్పినా వినలేదు.. అందుకే రూ.35వేల కోట్లు లాభం వచ్చింది!

20 Sep, 2022 12:30 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌ రష్యా వివాదం భారత్‌కు బాగానే కలిసొచ్చింది. యుద్ధ పరిణామాల కారణంగా రష్యా డిస్కౌంట్లతో కూడిన చమురును సరఫరా చేయడంతో భారత్‌ ఖజానాకు రూ.35వేల కోట్లు లాభం వచ్చింది. దేశీయ క్రూడ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ విధించడంతో పాటు తగ్గింపుతో ముడి చమురు దిగుమతి చేసుకోవడం వల్ల ఈ మొత్తం సమకూరింది. ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా-ఉక్రెయిన్ వివాదం తర్వాత ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం విండ్‌ఫాల్ పన్నును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

ఎవరు చెప్పినా వినలే.. అందుకే లాభం వచ్చింది! 
ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యా పై అగ్రరాజ్యంతో పాటు యూరోప్‌ దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ సమస్యకు పరిష్యారంగా రష్యా భారత్‌తో తనకున్న సత్సంబంధాలను దృష్టిలో ఉంచుకుని ముడి చమురుని భారీ డిస్కౌంట్లతో సరఫరా చేసింది. ఈ క్రమంలో గత కొన్ని నెలలుగా రష్యా నుంచి భారత అధికంగా ముడి చమురు దిగుమతి చేసుకుంది.   

మరో వైపు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయద్దని అగ్రరాజ్యంతో పాటు పలు అభివృద్ధి చెందిన దేశాల నుంచి భారత్‌కు విపరీతమైన ఒత్తిడి ఉన్నప్పటికీ, వాటిని పట్టించుకోకుండా ముడి చమురును దిగుమతి చేసుకుంది. తద్వారా భారత్‌కు రూ.35వేల కోట్లు లాభాం చేకూరింది. యుద్ధానికి ముందుగా మన దేశ  ఆయిల్‌ వాటాలో రష్యా వాటా 1 శాతం ఉండగా, ఇప్పుడది 12 శాతానికి చేరడం విశేషం. 

చదవండి: లక్కీ బాయ్‌.. 5 నిమిషాల వీడియో పంపి, రూ.38 లక్షల రివార్డ్‌ అందుకున్నాడు!


 

>
మరిన్ని వార్తలు