ఉక్రెయిన్‌ వార్‌.. భారత్‌కు అలా కలిసొచ్చిందా!

26 Jul, 2022 13:25 IST|Sakshi

అనూహ్య పరిణామాల మధ్య ఉక్రెయిన్‌ రష్యా యుద్ధం మొదలైందన్న సంగతి తెలిసిందే. ప్రపంచదేశాలు ఎంత ప్రయత్నించినప్పటికీ ఈ మారణహోమాన్ని ఆపలేకపోయాయి. మరో వైపు యుద్ధం కారణంగా పలు  దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించాయి. దీంతో మొదట్లో రష్యా కాస్త తడబడినా చివరికి ఈ సమస్యకు పరిష్కారంగా భారత్‌ కనిపించింది. దేశంలో చమురు సంస్థలకు ఈ అంశం కలిసొచ్చిందనే చెప్పాలి. యుద్ధ ప్రభావంతో గతంలో కంటే రష్యా నుంచి భారీగా దిగుమతులు చేసుకుంది భారత్‌.

నివేదికల ప్రకారం.. ఉ ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లోనే రష్యా దిగుమతులు 3.7 రెట్లు పెరిగి 5 బిలియన్ డాలర్లకు చేరింది. కాగా ఈ రెండు నెలల కాలంలోనే జరిగిన దిగుమతులు ఏడాది దిగుమతుల్లో సగం ఉన్నట్లు తెలుస్తోంది. రష్యాపై వివిధ దేశాల ఆంక్షలు, తక్కువ ధరకే క్రూడ్‌ అయిల్‌ వంటి కారణాల వల్ల ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు భారత్‌ 8.6 బిలియన్‌ డాలర్ల వస్తువులను రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. గత సంవత్సరం ( 2021)లో ఇది 2.5 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇందులో ముడి చమురు, ఎరువులు, వంటనూనెలు, బొగ్గు, ఉండగా, మరోవైపు ఖరీదైన రాళ్లు, వజ్రాలు వంటి దిగుమతులు మాత్రం తగ్గాయి.

చదవండి: SBI Change Rule: ఏటీఎం యూజర్లకు గమనిక, ఆ నిబంధన అందరికీ రానుందా?

మరిన్ని వార్తలు