అ్రల్టాటెక్‌ లాభం రూ. 1,310 కోట్లు

19 Oct, 2021 05:12 IST|Sakshi

క్యూ3లో కోల్‌ మైనింగ్‌ షురూ!

న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌ దిగ్గజం అ్రల్టాటెక్‌ సిమెంట్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో అంతంతమాత్ర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జులై–సెపె్టంబర్‌(క్యూ2)లో యథాతథంగా రూ. 1,310 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇందుకు పెట్‌ కోక్‌ ధరలు భారీగా పెరగడం ప్రభావం చూపింది. అయితే మొత్తం ఆదాయం 16 శాతం ఎగసి రూ. 12,017 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 10,387 కోట్ల ఆదాయం నమోదైంది.

ఇక ఈ క్యూ2లో మొత్తం వ్యయాలు 17 శాతం పెరిగి రూ. 10,209 కోట్లను అధిగమించాయి. కోల్, పెట్‌ కోక్‌ ధరలు రెట్టింపుకావడంతో ఇంధన వ్యయాలు 17 శాతం అధికమైనట్లు కంపెనీ తెలియజేసింది. అయితే విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించుకోవడం, నిర్వహణ సామర్థ్యంపై దృష్టిపెట్టడం ద్వారా కొంతమేర వ్యయాలను అదుపు చేసినట్లు తెలియజేసింది. క్యూ3(అక్టోబర్‌–డిసెంబర్‌)లో మధ్యప్రదేశ్‌లోని బిచర్‌పూర్‌ కోల్‌ బ్లాకులో మైనింగ్‌ కార్యకలాపాలు ప్రారంభంకాగలవని కంపెనీ అంచనా వేస్తోంది. తద్వారా బొగ్గు కొనుగోళ్లపై ఆధారపడటాన్ని తగ్గించుకునే యోచనలో ఉంది.

అమ్మకాలు అప్‌..: క్యూ2లో సిమెంట్‌ అమ్మకాలు 8% పుంజుకుని 21.64 మిలియన్‌ టన్నులను తాకాయి. ఈ అక్టోబర్‌లో 1.2 ఎంటీపీఏ సిమెంట్‌ సామర్థ్యం అందుబాటులోకి వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. బీహార్‌లోని పాట లీపుత్ర సిమెంట్‌ వర్క్స్, పశి్చమ బెంగాల్‌లోని డాంకునీ సిమెంట్‌ వర్క్స్‌ యూనిట్లు ప్రారంభమైనట్లు పేర్కొంది.

ఫలితాల నేపథ్యంలో అ్రల్టాటెక్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో యథాతథంగా రూ. 7,395 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు