Ultratech Cement: అల్ట్రాటెక్‌ వేల కోట్ల పెట్టుబడులు!

3 Jun, 2022 11:11 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ దిగ్గజం అల్ట్రాటెక్‌ సిమెంట్‌ లిమిటెడ్‌ సామర్థ్య విస్తరణ బాట పట్టింది. దీనిలో భాగంగా ప్రస్తుత ప్లాంట్ల సామర్థ్య పెంపు, కొత్త యూనిట్ల ఏర్పాటును చేపట్టనుంది. ఇందుకు రూ. 12,886 కోట్ల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు అల్ట్రాటెక్‌ వెల్లడించింది. 

తద్వారా 22.6 మెట్రిక్‌ టన్నుల వార్షిక(ఎంటీపీఏ) సామర్థ్యాన్ని జత చేసుకునే ప్రణాళికలు అమలు చేయనున్నట్లు తెలిపింది. తాజాగా సమావేశమైన బోర్డు ఈ ప్రతిపాదనలను అనుమతించినట్లు ఆదిత్య బిర్లా గ్రూప్‌ సిమెంట్‌ దిగ్గజం పేర్కొంది. భవిష్యత్‌ వృద్ధికి వీలుగా పెట్టుబడులను వెచ్చించనున్నట్లు పేర్కొంది. 

ప్రస్తుతం అల్ట్రాటెక్‌ 120 ఎంటీపీఏ సిమెంట్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదిత విస్తరణలు పూర్తయితే కంపెనీ మొత్తం సిమెంట్‌ ఉత్పత్తి సామర్థ్యం 159 ఎంటీపీఏను దాటనుంది.

మరిన్ని వార్తలు