మార్కెట్లోకి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్.. కుర్రకారు ఫిదా కావాల్సిందే!

14 Oct, 2021 20:12 IST|Sakshi

బెంగళూరు: ఇప్పటి వరకు మార్కెట్లోకి వచ్చిన ఎలక్ట్రిక్ కంపెనీలు ఒక లెక్క నేను ఒక లెక్క అంటుంది ఈ ఎలక్ట్రిక్ బైక్ కంపెనీ. ఓలా ఎలక్ట్రిక్, సింపుల్ ఎనర్జీ వంటి మార్కెట్లో హీట్ పెంచుతున్నాయి. త్వరలోనే ఈ పోటీలో చేరడానికి అల్ట్రా వయొలెట్ ఎఫ్77 స్పోర్ట్స్ బైక్ రాబోతుంది. బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ తన మొదటి బైక్ అల్ట్రా వయొలెట్ ఎఫ్77ను మార్చి 2022 నాటికి భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అల్ట్రా వయొలెట్ ఎఫ్77. ఇప్పటివరకు ఇదే భారతదేశంలో అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్. (చదవండి: 6జీ ఇంటర్నెట్ స్పీడ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!)

అయితే, కంపెనీ ఇంకా అల్ట్రా వయొలెట్ ఎఫ్77 బైక్ ధరను ఆవిష్కరించలేదు. అయితే, ఫేమ్ 2 సబ్సిడీకి ముందు ఈ బైక్ సుమారు రూ.3 లక్షల ఎక్స్ షోరూమ్ ధరకు లాంఛ్ అయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అల్ట్రా వయొలెట్ ఎఫ్77 బైక్ కేవలం 2.9 సెకన్లలో 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని ఆటోమేకర్ పేర్కొంది. రాబోయే ఎలక్ట్రిక్ బైక్ సింగిల్ ఛార్జ్ పై సుమారు 150 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని భావిస్తున్నారు. ఎలక్ట్రిక్ వేహికల్ మేకర్ బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఉన్న ప్రొడక్షన్ ఫెసిలిటీలో బైక్ లను తయారు చేయడానికి సిద్ధంగా ఉంది.

కంపెనీ మొదటి సంవత్సరంలో సుమారు 15,000 యూనిట్లను తయారు చేయగలదని పేర్కొంది. ఈ బైక్ గంటకు 140 కిలోమీటర్ల వేగంతో వెళ్లనుంది. ఇది ఓలా ఎస్1 ప్రొ కంటే కనీసం 30 కిలోమీటర్లు ఎక్కువ. 7.5 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీనిలో మూడు బ్యాటరీలు ఉంటాయి. దీనిని ఫాస్ట్ చార్జర్ సహాయంతో 1.5 గంటలు, సాధారణ చార్జర్ సహాయంతో 5 గంటల్లో చార్జ్ చేయవచ్చు. ఇండలో Eco mode / Sport mode / Insane mode ఉన్నాయి. ఇంకా ఇతర స్మార్ట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.

మరిన్ని వార్తలు