ఫాస్టెస్ట్‌ ఈ-బైక్‌.. వాటి వేరియంట్లపై ఓ లుక్కేద్దాం!

28 Nov, 2022 21:45 IST|Sakshi

బెంగళూరుకు చెందిన ప్రముఖ EV స్టార్టప్ కంపెనీ 'అల్ట్రావయోలెట్' (Ultraviolette) ఇటీవల ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ 'F77' లాంచ్ చేసిన విషయం తెలిసిందే. కంపెనీ లాంచ్ సమయంలోనే మూడు వేరియంట్స్ (ఎఫ్77, రీకాన్, ఎఫ్77 లిమిటెడ్ ఎడిషన్) గురించి వెల్లడించింది. అయితే బైక్ ప్రేమికులు చాలా మంది ఈ మూడు వేరియంట్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలని చాలా కుతూహలంతో ఉన్నారు. ఈ మూడు వేరియంట్స్ డిజైన్, ఫీచర్స్, రేంజ్ వంటి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

అల్ట్రావయోలెట్ ఎఫ్77:
ఎఫ్77 అనేది కంపెనీ మూడు వేరియంట్స్ లో మొదటి మోడల్ (బేస్ మోడల్). దీని ధర రూ. 3.80 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ఎలక్ట్రిక్ బైక్ 7.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఇది ఒక సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 207 కిమీ పరిధిని అందిస్తుంది. ఈ బైక్ కేవలం 3.4 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వేగం,  8.3 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది.

అల్ట్రావయోలెట్ ఎఫ్77 లోని బ్యాటరీ ప్యాక్ మీద కంపెనీ 3 సంవత్సరాలు లేదా 30,000 కిమీ వారంటీని అందిస్తుంది. అయితే దీనిని 5 సంవత్సరాలు లేదా 50,000 కిమీ వారంటీకీ అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఇది కొనుగోలుదారులు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక కలర్ ఆప్సన్ విషయానికి వస్తే, ఎఫ్77 బ్లాక్, సిల్వర్, రెడ్ కలర్‌లో అందుబాటులో ఉంటుంది.

అల్ట్రావయోలెట్ ఎఫ్77 రీకాన్:
అల్ట్రావయోలెట్ మరో వేరియంట్ అయిన ఎఫ్77 రీకాన్ విషయానికి వస్తే, దీని ధర రూ. 4.55 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 307 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని కోసం కంపెనీ ఇందులో 10.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉపయోగించింది. ఈ బైక్ కేవలం 3.1 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ, 8.0 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగాన్ని అందుకుంటుంది.

దీన్ని బట్టి చూస్తే ఇది బేస్ మోడల్ కంటే కూడా ఎక్కువ వేగవంతంమైన బైక్ అని స్పష్టంగా తెలుస్తుంది. ఇక బ్యాటరీ ప్యాక్ వారంటీ విషయానికి వస్తే, స్టాండర్డ్ గా 5 సంవత్సరాలు లేదా 50,000 కిమీల వారంటీని పొందవచ్చు. అయితే దీనిని 8 సంవత్సరాలు లేదా 80,000 కిమీ వారంటీకీ అప్డేట్ చేసుకోవచ్చు. కలర్స్ విషయానికి వస్తే బేస్ మోడల్ ఏ కలర్ ఆప్సన్లో లభిస్తుంది. అదే కలర్స్ (బ్లాక్, సిల్వర్, రెడ్) ఇది కూడా లభిస్తుంది.

అల్ట్రావయోలెట్ ఎఫ్77 లిమిటెడ్ ఎడిషన్:
ఇక చివరగా ఇందులోని చివరి మోడల్ ఎఫ్77 లిమిటెడ్ ఎడిషన్ పేరుకి తగిన విధంగానే ఇది లిమిటెడ్ యూనిట్లలో మాత్రమే లభిస్తుంది. కావున ఇది కేవలం 77 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడింది. అంటే ఈ బైక్ కేవలం 77 మంచి కస్టమర్లు మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది.

అల్ట్రావయోలెట్ ఎఫ్77 లిమిటెడ్ ఎడిషన్ ధర రూ. 5.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). ధరను బట్టి చూస్తే ఇది కంపెనీ అత్యంత ఖరీదైన బైక్. అయితే పనితీరు విషయంలో మిగిలిన రెండు బైకులంటే కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ బైక్లో రీకాన్ వేరియంట్లో ఉన్న అదే బ్యాటరీ (10.3 కిలోవాట్) ఉంటుంది. కావున రేంజ్ కూడా రీకాన్ మోడల్ మాదిరిగానే 307 కిమీ ఉంటుంది.

ఎఫ్77 లిమిటెడ్ ఎడిషన్ కేవలం 2.9 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ, 7.8 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ బ్యాటరీ ప్యాక్ మీద 8 సంవత్సరాలు లేదా 80,000 కిమీ వారంటీ మాత్రమే అందుబాటులో ఉంటుంది. 

బుకింగ్స్, డెలివరీ:
కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైకుని మార్కెట్లో లాంచ్ చేయకముందు నుంచే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కావున ఆసక్తి  కలిగిన కొనుగోలుదారులు రూ. 10,000 చెల్లించి కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు మొదట బెంగళూరులో ప్రారంభమవుతాయి. ఆ తరువాత దశల వారిగా డెలివరీలు ప్రారభించనుంది కంపెనీ. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ బైక్ భారతీయ తీరాలను కూడా దాటి విదేశాలలో కూడా విక్రయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు