World Food Programme బిలియనీర్స్‌.. 42 మిలియన్ల మందిని కాపాడండి!

29 Oct, 2021 15:28 IST|Sakshi

అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌, టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌లు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు. ఇటీవల విడుదలై ఫోర్బ్స్‌ లెక్కల ప్రకారం ప్రపంచ ధనవంతుల జాబితాల్లో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. కానీ వీళ్లు దానం చేయడంలోనే  ఏక్‌ నెంబర్‌ పిసినారులుగా అప్రతిష్టను మూటగట్టుకున్నారు. అయితే పిసినారులుగా ఉన్న వీళ్లిద్దరూ ఒకే సారి 6 బిలియన్‌ డాలర్లు డొనేట్‌ చేస్తే 42 మిలియన్ల మంది ( 4కోట్ల 20లక్షల మంది) ఆకలి కేకల నుంచి బయట పడతారని వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.

ఆకలి కేకలు..
యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రాం గణాంకాల ప్రకారం..వరల్డ్‌ వైడ్‌గా 155 మిలియన్ల మందికి సరైన ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. తాజాగా ఇదే అంశంపై యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రాం ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ డేవిడ్ బీస్లీ..ప్రముఖ మీడియా సంస్థ సీఎన్‌ఎన్‌తో మాట్లాడారు. గతేడాది ప్రపంచ వ్యాప్తంగా 155 మిలియన్ల మందికి సరైన ఆహారం లేదు. వారిలో 42 మిలియన్ల మంది  ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. 

వారిని కాపాడేందుకు ఎలన్‌ మస్క్‌, జెఫ్‌ బెజోస్‌లు ఒకే ఒక్కసారి  6 బిలియన్లను దానం చేయాలని కోరుతున్నాం.  కోవిడ్‌ సమయంలో జెఫ్‌బెజోస్‌ ఆస్తి 6 బిలియన్లు పెరిగింది. తాజాగా ఎలన్‌ మస్క్‌ ఒక్కరోజే 6 బిలియన్లు సంపాదించారు. ఆ మొత్తాన్ని డొనేట్‌ చేయాలి. అలా డొనేట్‌ చేయమని మేం రోజులు, వారాలు లేదంటే సంవత్సరాల పాటు అడగంలేదు. కేవలం ఒకే ఒక్కసారి ఇస్తే సరిపోతుంది. ఇద్దరు బిలియనీర్లు దానం చేస‍్తే 42 మిలియన్ల మందిని కాపాడినట్లవుతుందని సీఎన్‌ఎన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు యూఎస్‌ మొత్తం మీద 400మంది బిలియనీర్లు ఉన్నారు. గతేడాది వీరి సంపాదన 1.8 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. ఈ 400 మంది సంపాదించిన మొత్తంలో 36శాతం పేదలకు ఖర్చుపెట్టాలని కోరుతున్నాం' అని డేవిడ్ బీస్లీ మాట్లాడారు. 

ఫోర్బ్స్‌ లెక్కల ప్రకారం.. 
గత మంగళవారం (26వ తేదీ) రోజు ప్రపంచంలోనే అంత్యత ధనవంతుల జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేసింది. ఫోర్బ్స్‌ గణాంకాల ప్రకారం.. టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ 253.8 బిలియన్లు డాలర్లు, అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ 196.1 బిలియన్ల డాలర్లతో సంపాదనలో పోటీ పడుతున్నారు. ఎలన్‌ మస్క్‌ కేవలం ఒక్కరోజే టెన్‌ బిలియన్‌ డాలర్లను అర్జించారు.

చదవండి: ఎలన్‌ నువ్వు అసాధ్యుడివయ్యా..! అనుకుంటే ఏదైనా చేస్తావ్‌..!

మరిన్ని వార్తలు