మళ్లీ ఉద్యోగాల కోత..12 నెలల్లో 1400మందిని తొలగించిన స్టార్టప్‌

30 Mar, 2023 15:16 IST|Sakshi

సాక్షి,ముంబై: ఆన్‌లైన్ కోచింగ్ ప్లాట్‌ఫారమ్ అన్‌ఎకాడమీ మరోసారి ఉద్యోగుల తీసివేతకు నిర్ణయంచింది. లాభదాయకత కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో మరో రౌండ్‌ లేఫ్స్‌లను ప్రకటించింది. సిబ్బందిలో 12 శాతం లేదా 380 మంది ఉద్యోగులను తొలగించింది. 

ప్రధాన వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చడానికి సరైన దిశలో ప్రతీ అడుగు వేశాం. కానీ సరిపోలేదు.. ఈక్రమంలో దురదృష్టవశాత్తు మరో కష్టమైన నిర్ణయం తీసుకునేలా చేసిందని ఎడ్‌టెక్ స్టార్టప్ అన్‌ఎకాడమీ  వ్యవస్థాపకుడు గౌరవ్ ముంజాల్ ప్రకటించారు. 

(ఇదీ చదవండి: ఎంజీ బుజ్జి ఈవీ: స్మార్ట్ కాంపాక్ట్ కామెట్‌ వచ్చేస్తోంది!150 కి.మీ. రేంజ్‌లో)

గత 12 నెలల్లో ఇది నాలుగో రౌండ్ తొలగింపులు. 2022 ఏప్రిల్ లో 600 మందిని, గత ఏడాది నవంబర్‌లో 350 మంది ఉద్యోగులను తొలగించింది. కరోనా సమయంలో భారీ లాభాలనార్జించిన కంపెనీ తాజాగా తీవ్ర నష్టాలతో ఇబ్బందు లెదుర్కోంటోంది.  

కాగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు, బిజినెస్‌ దెబ్బతినడంతో ఖర్చు తగ్గించే చర్యల్లో భారతీయ స్టార్టప్‌లు ముఖ్యంగా ఫ్రంట్‌రో, బైజూస్, వేదాంతలాంటి ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి.  (నా కాస్ట్లీవిస్కీ మాయం: విమాన ప్రయాణికుడి ఆక్రోశం, ధర తెలిస్తే!)

మరిన్ని వార్తలు