లక్ష రూపాయల లోపు లభించే సూపర్‌బైక్స్‌ ఇవే!

28 Jul, 2022 16:38 IST|Sakshi

సాక్షి, ముంబై:  190 మిలియన్లకు పైగా వాహనాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్‌గా నిలస్తోంది ఇండియా. ముఖ్యంగా హోండా,హీరో, బజాజ్‌, టీవీఎస్‌ లాంటి కంపెనీలతోపాటు బీఎండబ్ల్యూ లాంటి లగ్జరీ బైక్‌లో మార్కెట్‌లో హల్‌ చల్‌ చేస్తున్నాయి. అయితే ఎక్కువ మైలేజీ, స్మార్ట్‌ ఫీచరలతో లభించే  ట్రెండీలుక్స్‌తో సరసమైన ధరలో లభించే బైక్స్‌పై కొనుగోలుదారులు ఆసక్తి ఎక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలో లక్ష రూపాయలలోపు ధరలో అందుబాటులోఉన్న బైక్‌లపై  ఓ లుక్కేద్దాం. 

హోండా  ఎస్పీ125
బీఎస్‌-6 నిబంధనలకుఅనుగుణంగా వచ్చిన హోండా తొలి బైక్‌  హోండా ఎస్పీ 125.  ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్‌తో కూడిన BS6 కంప్లైంట్ 125cc ఇంజన్‌తో10.5bhp గరిష్ట శక్తిని  10.3Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి  చేస్తుంది. ఈబైక్‌ రెండు వేరియంట్లలో, 5 కలర్స్‌లో లభిస్తోంది.  ప్రారంభ ధర  రూ. 82,243 (ఎక్స్-షోరూమ్) 

హీరో గ్లామర్
హీరోకు చెందిన  అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌లలో ఒకటి  హీరో గ్లామర్ ..124.7cc ఇంజన్‌తో పనిచేస్తుంది.ఇది 10.72 bhp శక్తిని, 10.6 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బీఎస్‌-6  కంప్లైంట్ మోడల్‌తో  చిన్న మార్పులతో మేక్ఓవర్‌ అయిన ఈ బైక్‌ ప్రారంభ ధర  రూ.78,753  హీరో గ్లామర్  12 వేరియంట్‌లు,13 కలర్ ఆప్షన్‌లలో లభ్యం.

హోండా షైన్
హోండా షైన్ కూడా ఈ సెగ్మెంట్‌లో చాలా పాపులర్ బైక్. 124cc సింగిల్ సిలిండర్ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో పనిచేస్తుంది. 10 bhp , 11 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6 కలర్ ఆప్షన్లలో లభ్యమవుతున్న హోండా షైన్ ధర రూ.77,338 (ఎక్స్-షోరూమ్)

హీరో సూపర్ స్ప్లెండర్
హీరో ఐకానిక్‌ బైక్‌ స్ప్లెండర్  ప్రీమియం వెర్షన్ హీరో సూపర్ స్ప్లెండర్. ఇది  124.7సీసీ ఇంజన్‌ 10.72 bhp, 10.6 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.  ప్రారంభ ధర రూ. 77,939 .

టీవీఎస్‌ రైడర్ 125
టీవీఎస్‌ రైడర్ 125 124.8cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, త్రీ-వాల్వ్ ఇంజన్‌తో 11.2 bhp శక్తిని , 11.2 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. 4 కలర్స్‌, 3 వేరియంట్‌లలో లభ్యం. అద్భుతమైన డిజైన్‌తో ఆకట్టుకునే  ఈ బైక్‌ ప్రారంభ ధర రూ. 88,078(ఎక్స్-షోరూమ్)

బజాజ్ పల్సర్ 125
బజాజ్ పల్సర్ 125 ప్రస్తుతం భారతదేశంలో విక్రయించబడుతున్న పల్సర్ మోనికర్‌తో అత్యంత సరసమైన బైక్. రూ. 82,712 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర. 4 వేరియంట్‌లు  3 కలర్ ఆప్షన్‌లలో  లభ్యం.ఈ బైక్‌లోని 124.4 సీసీ, ఎయిర్-కూల్డ్, DTSI ఇంజన్‌తో 1.64 bhp , 10.8 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
 

మరిన్ని వార్తలు