యూనియన్‌ బ్యాంకు లాభంలో మూడు రెట్ల వృద్ధి

30 Jul, 2021 00:44 IST|Sakshi

న్యూఢిల్లీ: యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (యూనియన్‌ బ్యాంకు) జూన్‌ త్రైమాసికానికి రూ.1,120 కోట్ల కన్సాలిడేటెడ్‌ లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.341 కోట్లతో పోలిస్తే మూడు రెట్లకు పైగా వృద్ధి నమోదైంది. ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో లాభం రూ.1,269 కోట్లతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. మొత్తం ఆదాయం రూ.20,666 కోట్లుగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.20,487 కోట్లతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. వసూలు కాని నిరర్థక రుణాలు (ఎన్‌పీఏలు), కంటింజెన్సీలకు చేసిన కేటాయింపులు రూ.3,593 కోట్లుగా ఉన్నాయి. స్థూల ఎన్‌పీఏలు 14.95% (రూ.97,190 కోట్లు) నుంచి 13.60%కి (రూ.87,762 కోట్లు) మెరుగుపడగా.. నికర ఎన్‌పీఏలు 4.97 శాతం నుంచి 4.69%కి (రూ.27,437 కోట్లు) తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో యూనియన్‌ బ్యాంకు షేరు 7% లాభంతో రూ.37.95 వద్ద క్లోజయింది.

మరిన్ని వార్తలు