Union Budget 2023: స్టాక్‌ మార్కెట్‌పై బడ్జెట్‌ ‍ప్రభావం ఎలా ఉంటుంది!

29 Jan, 2023 11:29 IST|Sakshi

బడ్జెట్‌.. బడ్జెట్‌.. బడ్జెట్‌.. ప్రతి ఏటా జనవరి చివరి వారం నుంచి ఫిబ్రవరి 1 వరకు దేశవ్యాప్తంగా ఈ పేరు వినిపిస్తుంటుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌ కోసం సాధారణ ప్రజలు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడిదార్ల వరకు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తుంటారు. ఆశించిన మేరకు బడ్జెట్‌ ఉంటే ఆనందాలు వెలువెత్తడం లేదంటే నెట్టింట మీమ్స్‌తో రచ్చ చేయడం ఇటీవల చూస్తూనే ఉన్నాం. మోదీ సర్కార్‌ ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్‌ ఇదే, 2024లో సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో రాబోవు బడ్జెట్‌పై  ప్రతి రంగంలో, ప్రతి వర్గంలో ఎన్నెన్నో అంచనాలు కనిపిస్తున్నాయి. ఇక స్టాక్‌ మార్కెట్‌పై బడ్జెట్‌ ప్రభావం ఎలా ఉండబోతోందని తెలుసుకుందాం!  

స్టాక్‌ మార్కెట్‌పై ప్రభావం
 గత కొన్ని సంవత్సరాల పరిస్థితులను పరిశీలిస్తే సాధారణ బడ్జెట్‌కు ముందు స్టాక్ మార్కెట్లలో నీరసమైన వాతావరణం కనిపిస్తుంది. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం వాటి కదిలికలు మొదలవుతున్నాయి. బడ్జెట్ పూర్తిగా ద్రవ్యానికి సంబంధించిన అంశం. కాబట్టి దీని ప్రభావం మిగతా వాటిపై కచ్చితంగా ఉంటుంది. స్టాక్‌మార్కెట్‌పై బడ్జెట్‌ ప్రభావం ఎలాంటిదనే విషయం మాత్రం ఆర్థికమంత్రి మీద ఆధారపడి ఉంటుంది. వివిధ రంగాలకు కేటాయించిన మొత్తం ఆధారంగా ఈ ప్రభావాన్ని నిర్ణయించవచ్చు.ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా అభివృద్ధికి పెద్ద పీట వేస్తే ఆ సానుకూల నిర్ణయాలతో స్టాక్‌ మార్కెట్లు పుంజుకుంటాయి. ఇక బడ్జెట్​ ప్రవేశపెట్టే వారంలో సూచీల్లో ఒడుదొడుకులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది.

చదవండి: ఆ సూపర్‌ లగ్జరీ కార్ల క్రేజ్‌.. అబ్బో రికార్డు సేల్స్‌తో దూసుకుపోతోంది!

మరిన్ని వార్తలు