Union Budget 2023: అరుదైన ఘనత నిర్మలా సీతారామన్‌ సొంతం.. అదో రేర్‌ రికార్డ్‌!

26 Jan, 2023 17:05 IST|Sakshi

ప్రతి ఏటా వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న కేంద్రప్రభుత్వం (Central Government) ప్రవేశపెడుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం ఈ వార్షిక బడ్జె‌ట్‌ను తయారు చేస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. అయితే ఈ బడ్జెట్‌కి సంబంధించి నిర్మలా సీతారామన్‌ ఓ అరుదైన ఘనత సాధించారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

తొలి మహిళగా రికార్డ్‌.. ఆమె సొంతం
కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ను గత నాలుగేళ్లుగా ప్రవేశపెడుతున్నారు. ఆమెకు వరుసగా ఇది ఐదో బడ్జెట్‌. ఇంతవరకు నాలుగు బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన మహిళ ఆర్థిక మంత్రి ఎవ్వరూ లేరు. గతంలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళగా ఇందిరాగాంధీ చరిత్ర సృష్టించారు. కాగా ఈ రికార్డు కొన్నేళ్లు చెక్కు చెదరకుండా అలానే ఉండిపోయింది.

అంతేకాకుండా భారత తొలి మహిళా ఆర్థిక మంత్రి ఇందిరనే. 1969లో మొరార్జీ దేశాయ్‌ ఆర్థిక మంత్రిగా రాజీనామా చేయడంతో ప్రధాన మంత్రిగా ఉంటూ ఇందిరాగాంధీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇంధిరా గాంధీ తర్వాత రెండో మహిళా ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌ ఎక్కువ సార్లు(నాలుగు సార్లు) బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు