Union Budget 2023: ఆర్థిక మంత్రి పదే పదే ప్రస్తావించిన 'అమృత్ కాల్' అంటే ఏంటి?

1 Feb, 2023 15:32 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటుకు సమర్పించారు. ప్రధానంగా ఇందులో వేతన జీవులకు ఊరట కల్పిస్తూ ఆదాయపన్ను పరిమితిని పెంచారు. మైనారిటీల సాధికారత, మహిళా సాధికారత, అందరికీ తగిన అవకాశాల కల్పనపై దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంపై దృష్టిపెట్టినట్లు తెలిపారు. అలాగా సప్తరుషి పేరుతో ఏడు ప్రాధాన్యత అంశాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.

నిర్మలా సీతారామన్ పదే పదే ప్రస్తావించిన 'అమృత్ కాల్' అంటే ఏమిటి?
అమృత కాలంలో  ఇది తొలి బడ్జెట్ అని ఆమె ప్రకటించడం విశేషంగా నిలిచింది.  'అమృత్ కాల్' అనే పదాన్ని తొలిసారిగా 2021లో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని (పీఎం) నరేంద్ర మోదీ ఉపయోగించారు.

రాబోయే 25 సంవత్సరాల కోసం భారతదేశం కోసం కొత్త రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించేటప్పుడు ప్రధాని మోదీ ఈ పదాన్ని ఉపయోగించారు. ఆ సమయంలో, అమృత్ కాల్ ఉద్దేశ్యం భారతదేశ పౌరుల జీవితాలను మెరుగుపరచడం. గ్రామాలు, నగరాల మధ్య అభివృద్ధిలో విభజనను తగ్గించడం అని ప్రధాని మోదీ అన్నారు. ప్రజల జీవితాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించడం మరియు సరికొత్త సాంకేతికతను స్వాగతించడం కూడా దీని లక్ష్యం అని ప్రకటించారు.

మరిన్ని వార్తలు