నైపుణ్యాల శిక్షణపై పెట్టుబడులు పెట్టండి

28 Sep, 2022 06:39 IST|Sakshi

పరిశ్రమలకు మంత్రి ప్రధాన్‌ పిలుపు

న్యూఢిల్లీ: కార్మికుల్లో శిక్షణ, నైపుణ్యాభివృద్ధికి పెట్టుబడులు పెట్టాలని పరిశ్రమలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కోరారు. నైపుణ్యాలు, విద్యను ప్రోత్సహించడానికి విధాన కర్తలు, విద్యా వంతులు, పరిశ్రమ కలసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని మంత్రి ప్రస్తావించారు. ఫిక్కీ నిర్వహించిన అంతర్జాతీయ నైపుణ్య సదస్సును ఉద్దేశించి మంత్రి ప్రధాన్‌ మాట్లాడారు. రెండు చేతులతోనే చప్పట్లు సాధ్యపడుతుందని చెబుతూ.. నైపుణ్యాభివృద్ధికి అందరు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.

పనివారిలో నైపుణ్యాల పెంపునకు పరిశ్రమ భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. ‘‘శిక్షణ ఇచ్చేవారు, లబ్ధిదారులే కనిపిస్తున్నారు. కానీ, పరిశ్రమల భాగస్వామ్యం ఎక్కడికి పోయింది? అని ప్రశ్నించారు. భారత్‌ను ప్రపంచానికి తయారీ కేంద్రంగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుందని గుర్తు చేస్తూ.. నిపుణులైన మానవవనరులు ఉన్నప్పుడే ఈ లక్ష్యం సాకరమవుతుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పరిశ్రమలకు ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తోందని చెప్పారు. నైపుణ్యాల శిక్షణకు కూడా నిధులు ఖర్చు చేస్తోందని చెబుతూ.. పరిశ్రమలు కూడా ముందుకు రావాలని కోరారు.  

మరిన్ని వార్తలు