Unicorn Robot: పిల్లల కోసం, మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్‌ ఒంటికొమ్ము గుర్రాలు

26 Sep, 2021 08:26 IST|Sakshi

ప్రపంచ దేశాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల హవా నడుస్తోంది. అందుకు తగ్గుట్లుగానే ఆటోమొబైల్‌ సంస్థలు కొత్త కొత్త మోడల్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల్ని విడుదల చేస్తున్నాయి. అయితే ఓ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ మాత్రం పిల్లలు ఆడుకునే బొమ్మల్ని ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చేస్తుంది.

ఆట బొమ్మలకు అటానమస్‌ డ్రైవింగ్‌ టెక్నాలజీతో పాటు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెంట్స్‌(ఏఐ)ని యాడ్‌ చేసింది. ఆ టెక్నాలజీ సాయంతో రోబో ఎలక్ట్రిక్‌ గుర్రాల్ని విడుదల చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.ఈ గుర్రాల్ని పిల్లలు అవసరం అనుకున్నప్పుడు ఆడుకోవచ్చు. సరదాగా వీధుల్లో ఎంచక్కా చక్కర్లు కొట్టొచ్చు

చైనాకు చెందిన ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ ‘జిపెంగ్‌’ ‘యూనికార్న్‌’(గుర్రం)ను తయారు చేసింది.పాశ్చాత్య పురాణగాథల్లో కనిపించే ఒంటికొమ్ము గుర్రం ‘యూనికార్న్‌’ స్ఫూర్తితో దీనిని కూడా ఒంటికొమ్మును డిజైన్‌ చేసింది. ఆటానమస్‌ డ్రైవింగ్‌ టెక్నాలజీకి తోడు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో రూపొందించిన ఈ రోబో యూనికార్న్‌ పిల్లలు ఇంట్లో ఆడుకోవడానికే కాదు, వీధుల్లో దీనిపైకెక్కి సవారీ చేసేందుకు కూడా ఉపయోగపడుతుందని తయారీదారులు చెబుతున్నారు. ప్రస్తుతం దీని నమూనాపై  ట్రయల్స్‌  జరుపుతున్నారు. త్వరలోనే దీనిని మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

చదవండి: ఎప్పటికింకా రోజీ వయసు ఇరవై రెండేళ్లే!

మరిన్ని వార్తలు