ఐక్యరాజ్య సమితికి సైబర్‌ సెగ, కీలక సమాచారం హ్యాక్‌!

11 Sep, 2021 15:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఐక్యరాజ్య సమితిపై సైబర్‌ ఎటాక్‌ జరిగింది. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సర్వర్లకు ఉండే రక్షణ వ్యవస్థలను హ్యకర్లు చేధించారు. పలు దేశాల మధ్య జరిగిన చర్చలు, లావాదేవీలకు సంబంధించిన కీలక సమాచారం హ్యాక్‌ అయినట్టు తెలుస్తోంది. 

అవును నిజమే
గుర్తు తెలియని హ్యాకర్లు ఐక్యరాజ​‍్య సమితికి సంబంధించి పలు విభాగాలకు సంబంధించిన సమాచారాన్ని హ్యక్‌ చేశారని యూఎన​ సెక్రటరీ జనరల్‌ అధికార ప్రతినిధి స్టిఫెన్‌ డుజారిక్‌ తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో హ్యకింగ్‌ జరిగినట్టు గుర్తించామని, దీనికిపై విచారణ కొనసాగుతోందని ఆయన తెలిపారు. 

హ్యకింగ్‌ ఇలా
ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాలకు సంబంధించిన కీలక సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను హ్యకర్లు ఎలా ఛేధించారనే దానిపై విచారణ కొనసాగుతోంది. యూన్‌కి సంబంధించిన ప్రొప్రైటరీ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ ఉద్యోగికి చెందిన యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ ఆధారంగా హ్యకర్లు యూఎన్‌ సిస్టమ్స్‌తో అనుసంధానమైనట్టు గుర్తించారు. 

ఆగస్టు వరకు
యూఎన్‌కి సంబంధించిన సిస్టమ్స్‌తో యాక్సెస్‌ సాధించిన హ్యకర్లు ఏప్రిల్‌ 5 నుంచి ఆగస్టు 7 వరకు వరుసగా చొరబడినట్టు గుర్తించారు. అయితే వారు ఏ సమాచారం తస్కరించారు. అందులో భద్రతాపరంగా కీలకమైనవి ఏమైనా ఉన్నాయా ? అనే అంశాలను గుర్తించే పనిలో యూఎన్‌ భద్రతా సిబ్బంది ఉన్నారు.

చదవండి: అశ్లీల వీడియోలకు పరోక్ష కారణం?.. ఎఫ్బీతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు

మరిన్ని వార్తలు