హైదరాబాద్‌లో 39 వేల గృహాల ఇన్వెంటరీ

13 Jan, 2021 14:01 IST|Sakshi

ఎనిమిది నగరాల్లో తగ్గిన గృహాల ఇన్వెంటరీ

న్యూఢిల్లీ: దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) 9 శాతం తగ్గి.. 7.18 లక్షలకు చేరాయి. ఇందులో 48 శాతం అఫర్డబుల్‌ విభాగంలోని గృహాలు కాగా.. 8 శాతం రెడీ–టు–మూవ్‌ హోమ్స్‌ ఉన్నాయని ప్రాప్‌టైగర్‌ తెలిపింది.  ‘రియల్‌ ఇన్‌సైట్స్‌ క్యూ–2020’ రిపోర్ట్‌ ప్రకారం.. 2019 డిసెంబర్‌ నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 7.92 లక్షల ఇన్వెంటరీ ఉండగా.. గతేడాది డిసెంబర్‌ 31 నాటికివి 7.18 లక్షలకు తగ్గాయి.

2019లో ఇన్వెంటరీ విక్రయానికి 27 నెలల సమయం పడితే.. ఇప్పుడవి 47 నెలలకు పెరిగిందని పేర్కొంది. హైదరాబాద్‌లో 39,308 గృహాల ఇన్వెంటరీ ఉంది. ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌)లో 2,67,987, పుణేలో 1,21,868, ఎన్‌సీఆర్‌లో 1,06,689, బెంగళూరులో 71,198, అహ్మదాబాద్‌లో 38,614, చెన్నైలో 36,609, కోల్‌కత్తాలో 30,210 గృహాలున్నాయి. ఇన్వెంటరీ విక్రయానికి అత్యధికంగా ఢిల్లీలో 72 నెలల సమయం పడితే.. హైదరాబాద్‌లో అత్యల్పంగా 29 నెలల సమయం పడుతుంది.   

చదవండి: ద్వితీయార్ధంలో ఖరీదైన గృహ విక్రయాల హవా

మరిన్ని వార్తలు