పెరిగిపోతున్న అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య, హైదరాబాద్‌లో ఎన్ని గృహాలు ఉన్నాయంటే!

9 Apr, 2022 07:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) పెరిగింది. 2021 మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చి నాటికి ఇన్వెంటరీ 4% మేర పెరిగిందని ప్రాప్‌టైగర్‌.కామ్‌ సర్వేలో తేలింది. గతేడాది మార్చి నాటికి దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 7,05,344 గృహాల ఇన్వెంటరీ ఉండగా..ఈ ఏడాది మార్చి నాటికి 7,35,852కి పెరిగిందని తెలిపింది. 

ఇన్వెంటరీ అత్యధికంగా ముంబైలో 35% ఉండగా.. పుణేలో 16% మేర ఉన్నాయి. కాగా.. గృహాలకు డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో గతేడాది ఇన్వెంటరీ విక్రయానికి 47 నెలల సమయం పట్టగా.. ఈ ఏడాది మార్చి ఇన్వెంటరీకి 42 నెలల సమయం పడుతుంది. 

నగరాల వారీగా అమ్ముడుపోకుండా ఉన్న గృహాల సంఖ్యను చూస్తే.. హైదరాబాద్‌లో 73,651 యూనిట్లున్నాయి. వీటి విక్రయానికి 42 నెలల సమయం పడుతుంది. అహ్మదాబాద్‌లో 62,602 గృహాలు, బెంగళూరులో 66,151, చెన్నైలో 34,059, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో 1,01,404, కోల్‌కతాలో 23,850, ముంబైలో 2,55,814 గృహాల ఇన్వెంటరీ ఉంది.

చదవండి: లబోదిబో! హైదరాబాద్‌లో ఇళ్లు అమ్ముడుపోని ప్రాంతాలివే! 

మరిన్ని వార్తలు