దేశంలో బంగారం దిగుమతుల జోరు

21 Apr, 2021 16:06 IST|Sakshi

మార్చిలో పసిడి దిగుమతులు 160 టన్నులు!

2020 ఇదే నెలలో ఈ పరిమాణం కేవలం 28.09 టన్నులు

ముంబై: భారత్‌ 2021 మార్చిలో భారీగా 160 టన్నుల బంగారం దిగుమతి చేసుకున్నట్లు రత్నాలు, ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) మంగళవారం పేర్కొంది. 2020లో ఈ పరిమాణం కేవలం 28.09 టన్నులు. సుంకాలు 5 శాతానికి తగ్గింపు, ధర తగ్గుదల, అమెరికా, బ్రిటన్‌ వంటి ఎగుమతుల మార్కెట్‌లో డిమాండ్‌ పెరుగుదల, భారత్‌లో పెళ్లిళ్ల సీజన్‌, మెరుగుపడిన వ్యాపార వినియోగ సెంటేమెంట్‌ వంటి అంశాలు మార్చిలో బంగారం దిగుమతులు భారీగా పెరగడానికి కారణమని మండలి పేర్కొంది. 

వాణిజ్య మంత్రిత్వశాఖ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం గడచిన ఆర్థిక సంవత్సరం (2020-21) బంగారం దిగుమతులు 22.58 శాతం పెరిగాయి. విలువలో ఇది 84.6 బిలియన్‌ డాలర్లు (దాదాపు 2.54 లక్షల కోట్లు). 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ విలువ 28.28 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.2 లక్షల కోట్లు). రానున్న అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో పసిడికి డిమాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉందన్నదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. పసిడిని దిగుమతి చేసుకుంటున్న ప్రధాన దేశాల్లో భారత్‌ ఒకటి. వార్షికంగా 800 నుంచి 800 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంటోంది.

చదవండి: ప్రీమియం వసూళ్లలో ఎల్‌ఐసీ రికార్డు

మరిన్ని వార్తలు