కియా నుంచి నాలుగు కొత్త కార్లు: సిఎన్‌జి, 5 సీటర్ ఇంకా..

16 Mar, 2023 09:09 IST|Sakshi

భారతదేశంలో దినదినాభివృద్ధి చెందుతున్న కియా మోటార్స్ మరో నాలుగు కొత్త కార్లను దేశీయ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో సిఎన్‌జి, 5 సీటర్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా 2025 నాటికి ఎలక్ట్రిక్ SUV విడుదలచేయడానికి తగిన ప్రయత్నాలు చేస్తోంది.

కొత్త కియా సెల్టోస్:

కంపెనీకి ఎక్కువ అమ్మకాలు తీసుకువస్తున్న ఉత్పత్తులలో కియా సెల్టోస్ ఒకటి. ఇది త్వరలో ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదలకానుంది. ఈ మోడల్ సౌత్ కొరియా, అమెరికా వంటి దేశాల్లో ప్రవేశపెట్టారు. కావున ఈ ఏడాది చివరినాటికి భారతీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. డిజైన్, ఫీచర్స్ పరంగా దాని మునుపటి మోడల్‌కి ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది.

కియా సోనెట్ సిఎన్‌జి:

ఇప్పటికే మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న కియా సోనెట్ సిఎన్‌జి రూపంలో విడుదలవుతుందని కంపెనీ తెలిపింది. సిఎన్‌జి వాహనాల వినియోగం పెరుతున్న తరుణంలో సోనెట్ సిఎన్‌జి విడుదలకు సిద్ధమవుతోంది. ఇది 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందనుంది, దీని ధర పెట్రోల్ వెర్షన్ కంటే రూ. 1 లక్ష ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

(ఇదీ చదవండి: ఆధార్ అప్డేట్: జూన్ 14 లాస్ట్ డేట్.. ఇలా చేస్తే అంతా ఫ్రీ)

కియా కారెన్స్ 5 సీటర్:

సెవెన్ సీటర్ విభాగంలో మంచి ఆదరణ పొందుతున్న కియా కారెన్స్ త్వరలో 5 సీటర్ రూపంలో విడుదలకానుంది. ఇందులోని న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్సన్స్‌లో లభించే అవకాశం ఉంది. అయితే ఈ ఫైవ్ సీటర్ కేవలం బేస్ వేరియంట్లకు మాత్రమే సాధ్యమవుతుందని కంపెనీ తెలిపింది.

న్యూ జనరేషన్ కార్నివాల్:

2023 కియా కార్నివాల్ 2023 ప్రారంభమలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో దర్శనమిచ్చింది. ఈ MPV ఈ ఏడాది చివరి నాటికి లేదా 2024 ప్రారంభంలో భారతీయ మార్కెట్లో విడుదలకానుంది. ప్రస్తుతం మార్కెట్లో అమ్మకానికి ఉన్న కార్నివాల్ కంటే 2023 మోడల్ కొంత పెద్దదిగా ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

మరిన్ని వార్తలు