కొత్త మొబైల్ కొనాలకుంటున్నారా? వచ్చే నెల విడుదలయ్యే కొత్త స్మార్ట్​ఫోన్స్‌, ఇవే!

21 Apr, 2023 16:22 IST|Sakshi

2023 ఏప్రిల్ నెల దాదాపు ముగిసింది. మే నెల ప్రారంభం కావడానికి మరెన్నో రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో వచ్చే నెలలో (మే 2023) విడుదల కానున్న కొత్త స్మార్ట్​ఫోన్స్‌ ఏవి? వాటి వివరాలేంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

గూగుల్​ పిక్సెల్​ 7ఏ (Google Pixel 7A):
2023 మే నెలలో విడుదలకానున్న లేటెస్ట్ స్మార్ట్​ఫోన్స్‌లో 'గూగుల్​ పిక్సెల్​ 7ఏ' (Google Pixel 7A) ఒకటి. వచ్చే నెల 10న జరగనున్న గూగుల్​ ఐ/ఓ 2023 ఈవెంట్​ వేదికగా ఈ మొబైల్ విడుదలకానున్నట్లు సమాచారం. ఈ మొబైల్ ఫోన్ ఆధునిక డిజైన్ కలిగి, అధునాతన ఫీచర్స్ పొందుతుంది.

6.1 ఇంచెస్​ అమోలెడ్​ డిస్​ప్లే కలిగిన గూగుల్​ పిక్సెల్​ 7ఏ 64ఎంపీ సోనీ ఐఎంఎక్స్​787 కెమెరా, లేటెస్ట్​ టెన్సార్​ జీ2 చిప్​సెట్​, 4500 ఎంఏహెచ్​ బ్యాటరీ వంటి ఫీచర్స్​ కలిగి ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్​ఫోన్స్‌ ధరలు లాంచ్ సమయంలో అధికారికంగా వెల్లడికానున్నాయి.

(ఇదీ చదవండి: ఆధార్ అప్‌డేట్ చేస్తున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయ్.. చూసారా..!)

గూగుల్​ పిక్సెల్​ ఫోల్డ్ (Google Pixel Fold)​:
గూగుల్ విడుదలచేయనున్న పిక్సెల్​ ఫోల్డ్ మొబైల్ కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మొబైల్ మే 10న లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 5.8 ఇంచెస్​ కవర్​ డిస్​ప్లే, 7.69 ఇంచెస్​ ఇన్నర్​ డిస్​ప్లే స్క్రీన్స్ కలిగి అద్భుతమైన కెమెరా ఆప్షన్స్ పొందే అవకాశం ఉంది.

రియల్​మీ 11 ప్రో (Realme 11 Pro):
భారతీయ మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్న స్మార్ట్​ఫోన్లలో రియల్​మీ బ్రాండ్ ఫోన్స్ ఎక్కువగా ఉన్నాయి. కాగా కంపెనీ వచ్చే నెలలో 11 ప్రో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ మొబైల్ 7000 సిరీస్​ చిప్​సెట్​ కలిగి 108mp ప్రైమరీ, 2mp డెప్త్​ కమెరా సెటప్ పొందనుంది. ఖచ్చితమైన లాంచ్ డేట్, ధరలు త్వరలోనే వెల్లడవుతాయి.

(ఇదీ చదవండి: మహీంద్రా థార్ కొనటానికి ఇదే మంచి తరుణం.. భారీ డిస్కౌంట్!)

రియల్​మీ 11 ప్రో ప్లస్​ (Realme 11 Pro Plus):
మే 2023లో విడుదలకానున్న మరో రియల్​మీ మొబైల్ '11 ప్రో ప్లస్'. ఇది వచ్చే నెలలో ఎప్పుడు లాంచ్ అవుతుందనే సమాచారం అందుబాటులో లేదు, కానీ ఇది దాని మునుపటి మోడల్స్ కంటే ఉత్తమ డిజైన్, ఫీచర్స్ పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ మొబైల్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

మరిన్ని వార్తలు