Upcoming Smartphones: ఆగస్ట్‌లో విడుదలయ్యే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌లు ఇవే!

1 Aug, 2022 21:38 IST|Sakshi

ఫెస్టివల్‌ సీజన్‌లో స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. పండుగ సీజన్‌ ప్రారంభం కావడంతో దేశీయంగా స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థలు ఫోన్‌లను విడుదల చేస్తుంటాయి. అయితే ఎప్పటిలాగే ఆగస్ట్‌ నెలలో కొత్త స్మార్ట్‌ ఫోన్‌లు మార్కెట్‌లో విడుదల కానున్నాయి. అవేంటో ఇప్పుడే చూసేద్దాం

 వన్‌ ప్లస్‌ 10టీ స్నాప్‌ డ్రాగన్‌ 8ప్లస్‌ జనరేషన్‌ 1 చిప్‌సెట్‌తో ఫ్లాగ్‌ షిప్‌ ఫోన్‌ను విడుదల అవ్వనుంది. ఆగస్ట్‌ 3న కొనుగోలు దారులకు పరిచయం కానుంది. 

మరో ఫ్లాగ్‌ షిప్‌ ఫోన్‌ ఐక్యూ9టీ సైతం ఆగస్ట్‌ 2న విడుదల కానుండగా..ఆ ఫోన్‌లో స్నాప్‌ డ్రాగన్‌ 8ప్లస్‌ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 

రియల్‌ మీ జీటీ నియో 3టీ స్నాప్‌డ్రాగన్‌ 870 చిప్‌సెట్‌తో ఆగస్ట్‌ 15 తరువాత విడుదల కానుంది.

శాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 4 సైతం ఆగస్ట్‌ 4న విడుదల కానుండగా.. ఈ ఫోన్‌ శాంసంగ్‌ విడుదల చేసే లేటెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌ ఇదేనని తెలుస్తోంది. 

మరో ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ షావోమీ 12లైట్‌ ఇదే నెలలో విడుదల కానుంది. 

200ఎంపీ ప్రైమరీ కెమెరా మోటరోలా ఎడ్జ్‌ ఎక్స్‌ 30 ప్రో ఆగస్ట్‌ 15 తర్వాత విడుదల కానుంది. 

పోకో ఎం5 బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్‌ ఆగస్ట్‌ 15తర్వాత విడుదల కానుంది. 

వివో వీ25ఫోన్‌ సైతం ఇదే నెలలో విడుదల కానుంది.

మరిన్ని వార్తలు