Top Upcoming Phones: జూన్‌లో విడుదల కానున్న 9 స్మార్ట్‌ ఫోన్‌లు ఇవే!

1 Jun, 2022 16:14 IST|Sakshi

దేశ వ్యాప్తంగా పెళ్లిళ్లు భారీ ఎత్తున జరుగుతున్నాయి. రెండేళ్ల నుంచి నామ మాత్రంగా జరిగినా ఈ ఏడాది వైరస్‌ ఉపశమనంతో పెళ్లికి అనుబంధంగా ఉన్న అన్నీ వ్యాపారాలు జోరుగా కొనసాగుతున్నాయి.పెళ్లి  సీజన్‌లో బట్టలు, బంగారంతో పాటు కొనుగోలు దారులు ఎక్కువగా కొనే స్మార్ట్‌ ఫోన్‌ సేల్స్‌ సైతం విపరీతంగా జరుగుతుంటాయి.

అందుకే జూన్‌లో దిగ్గజ స్మార్ట్‌ ఫోన్‌ సంస్థలైన ఒప్పో, వన్‌ ప్లస్‌, పోకో, రియల్‌ మీ, షావోమీ'లు ఫోన్‌లను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఇప్పుడు మనం ఏప్రిల్‌ నెలలో విడుదలయ్యే స్మార్ట్‌ ఫోన్‌ల గురించి తెలుసుకుందాం.

1.రియల్‌మీ
 
చైనా స్మార్మ్‌ ఫోన్‌ తయారీ సంస్థ రియల్‌ మీ జూన్‌ 7న స్నాప్‌ డ్రాగన్‌ 870 చిప్‌ సెట్‌తో రియల్‌ మీ జీటీ నియో 3టీ స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేయనుంది. 

2.పోకో

షావోమీ సబ్సిడరీ పోకో సంస్థ స్నాప్‌ డ్రాగన్‌ 8జనరేషన్‌ 1చిప్‌సెట్‌తో పోకో ఎఫ్‌4 జీటీ స్మార్ట్‌ ఫోన్‌ను జూన్‌ 15 తర్వాత విడుదల చేయనుంది

3.వన్‌ ప్లస్‌

మరో చైనా స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ వన్‌ ప్లస్‌ 90హెచ్‌ జెడ్‌ ఆమోలెడ్‌ డిస్‌ప్లే, 80 ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో వన్‌ ప్లస్‌ నార్డ్‌ 2టీని జూన్‌ నెలలో విడుదల చేయనుంది. 

4.ఒప్పో

ఒప్పో రెనో 8 సిరీస్‌ ఫోన్‌లు సైతం ఇదే నెలలో విడుదల కానున్నాయి. 

5.షావోమీ

స్నాప్‌ డ్రాగన్‌ 870 చిప్‌ సెట్‌తో షావోమీ 12ఎక్స్‌ మిడ్‌ రేంజ్‌ స్మార్ట్‌ ఫోన్‌ సైతం జూన్‌ 15 తేదీ లోపు విడుదల చేయనుంది

6.మోటో

జూన్‌ 2న అమెరికాకు చెందిన మరో స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ మోటరోలా   మోటో ఈ32ఎస్‌ పేరుతో బడ్జెట్‌ ఫోన్‌ను మార్కెట్‌కు పరిచయం చేయనుంది. 

7.శాంసంగ్‌

సౌత్‌ కొరియా ఎలక్ట్రానిక్‌ దిగ్గజం శాంసంగ్‌ బడ్జెట్‌ ధరలో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేయనుంది. శాంసంగ్‌ గెలాక్సీ ఏ13 పేరుతో జూన్‌ 15 తర్వాత విడుదల చేయనుంది. 

8.వివో

స్నాప్‌ డ్రాగన్‌ 870 చిప్‌ సెట్‌తో వివో టీ2 పేరుతో విడుదల కానున్న ఈ స్మార్ట్‌ ఫోన్‌ జూన్‌లో స్మార్ట్‌ ఫోన్‌ లవర్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది. 

9.మోటరోలా

మోటరోలా సంస్థ మోటో జీ52జే పేరుతో స్మార్ట్‌ ఫోన్‌ను జూన్‌ నెలలో విడుదల కానుంది.

చదవండి👉ఐఫోన్‌ లవర్స్‌కు బంఫరాఫర్‌!

మరిన్ని వార్తలు