2021లో రాబోయే షియోమీ ఫోన్లు ఇవే

8 Dec, 2020 20:14 IST|Sakshi

షియోమీ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త మొబైల్ లను తీసుకొస్తుంది. ఒక్కోసారి నెలకు 1, 2 ఫోన్లను ఈ కంపెనీ లాంచ్ చేస్తుంది. అలాగే 2021లో కూడా మరిన్నీ ఫోన్‌లను తీసుకురావడానికి షియోమీ సిద్ధంగా ఉంది. వచ్చే సంవత్సరం షియోమీ మనదేశంలో రెడ్‌మి బ్రాండ్ క్రింద రెడ్‌మి 10 సిరీస్, రెడ్‌మి నోట్ 10 సిరీస్ తీసుకొస్తున్నట్లు సమాచారం. అలాగే పోకో విషయానికి వస్తే పోకో ఎం 3 ప్రో, పోకో ఎమ్ 3 ప్రో మరియు పోకో ఎక్స్ 4, పోకో ఎక్స్ 5 ఫోన్లను తీసుకురానున్నట్లు సమాచారం. ఈ ఫోన్లపై ఇప్పటికే ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. 2021లో రాబోయే పూర్తీ షియోమీ ఫోన్‌ల జాబితా ఈ క్రింద ఉంది. (చదవండి: వోడాఫోన్ ఐడియా రికార్డు)

షియోమీ ఎంఐ 11, ఎంఐ 11 ప్రో
షియోమీ ఎంఐ 11 సిరీస్ లో రాబోయే మొబైల్ జనవరిలో వస్తుందని సమాచారం. దీనిలో ఇటీవల లీకైన సమాచారం ప్రకారం 108 ఎంపీ ప్రధాన కెమెరా, కర్వేడ్ డిస్ప్లే,  క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 888 5జీ ప్రాసెసర్ వంటి ఫీచర్లను తీసుకురానున్నారు. ఎంఐ 11 ప్రోలో ప్రధాన కెమెరా 108 మెగాపిక్సెల్ నుండి 192 మెగాపిక్సెల్స్ వరకు ఉండనుంది. 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను కూడా ఇందులో అందించనున్నట్లు సమాచారం.

పోకో ఎఫ్ 2
పోకో ఎఫ్ 2 త్వరలో భారతదేశంలో విడుదల కానుంది. పోకో ఎఫ్ 1 తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. పోకో ఈ మధ్యే ఎన్నో ఫోన్లను లాంచ్ చేయడం ప్రారంభించింది. పోకో ఎఫ్ 2 ఫీచర్ల గురుంచి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు.  

రెడ్‌మి నోట్ 10, రెడ్‌మి నోట్ 10 ప్రో, రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్
రెడ్ మీ నోట్ సిరీస్‌లో రానున్న తర్వాతి వెర్షన్ స్మార్ట్ ఫోన్లు ఇవే. రెడ్‌మి నోట్ 10, రెడ్‌మి నోట్ 10 ప్రో 108 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తాయని సమాచారం. రెడ్‌మి నోట్ 10 తక్కువలో 108 ఎంపి కెమెరా ఫోన్‌గా మారవచ్చు. దీనిలో స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్, 108-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కలిగిన 4800 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.

రెడ్‌మీ కే 40/ పోకో ఎక్స్ 4
రెడ్ మీ కే40 స్మార్ట్ ఫోన్ కూడా ఇప్పటికే పలు సర్టిఫికేషన్ వెబ్ సైట్లలో కనిపించింది. కాబట్టి ఈ ఫోన్ కూడా త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీనిలో స్నాప్‌డ్రాగన్ 775 5జీ ప్రాసెసర్ తో రావచ్చు. కొన్ని మార్కెట్లలో రెడ్ మీ బ్రాండింగ్, కొన్ని మార్కెట్లలో పోకో ఎక్స్4గా ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

రెడ్‌మి కే 40 ప్రో/ పోకో ఎఫ్ 3ప్రో
రెడ్‌మి కే 30 ప్రో లేదా పోకో ఎక్స్ 2 ప్రో స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్ తో భారతదేశానికి రావచ్చు. రెడ్‌మి కె 40 ప్రో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, మల్టీ కెమెరా సెటప్, 12 జిబి ర్యామ్, 5జీ కనెక్టివిటీ తీసుకొస్తున్నట్లు సమాచారం. 

రెడ్‌మి 10, రెడ్‌మి 10 ప్రైమ్, రెడ్‌మి 10 పవర్, రెడ్‌మి 10 ఐ
ఇవి రెడ్ మీ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల విభాగంలో లాంచ్ కానున్నాయి. రెడ్ మీ 9 సిరీస్ తర్వాతి వెర్షన్లుగా రెడ్ మీ 10 సిరీస్ రానుంది. వీటి ధర వచ్చేసి 7,000 నుండి రూ.12,000 ఉండనున్నట్లు సమాచారం. 2021 మొదటి త్రైమాసికంలో మొదలయ్యి ఏడాది పొడవునా రెడ్‌మి 10 సిరీస్ ఫోన్‌లను ఆవిష్కరిస్తూనే ఉంటుంది. 

పోకో ఎం3, పోకో ఎం 3 ప్రో
పోకో ఎం3 ఇప్పటికే లాంచ్ అయింది. కొన్ని దేశాల్లో ఈ ఫోన్ పోకో ఎం3 ప్రోతో పాటు లాంచ్ కానుంది. పోకో ఎం 3 రియల్‌మే నార్జో 20 ఎ, రియల్‌మే సి 15 మరియు ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో వంటి వాటికీ పోటీగా తీసుకొచ్చింది. పోకో ఎం3 స్నాప్‌డ్రాగన్ 662 చిప్ సెట్ 6,000ఎంఏహెచ్ బ్యాటరీతో నడుస్తుంది.  పోకో ఎం3 ఇండియా ధర బడ్జెట్ కేటగిరీ రూ.8,999 నుంచి ప్రారంభం కానుంది. పోకో ఎం 3 ప్రో 15,000 కేటగిరీలో మిడ్-బడ్జెట్ రేంజ్ లో తీసుకురానుంది.  

ఎంఐ నోట్ 10 లైట్/ఎంఐ 10ఐ
ఎంఐ నోట్ 10 లైట్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో 2021 ప్రారంభంలో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఎంఐ నోట్ 10 లైట్ సెప్టెంబర్‌లో ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. చైనాలో రెడ్ మీ నోట్ 9 ప్రో 5జీగా లాంచ్ అయిన ఫోన్ మనదేశంలో ఎంఐ 10ఐగా లాంచ్ కానుందని తెలుస్తోంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు