రూ. 11 లక్షల కోట్లకు చేరిన యూపీఐ చెల్లింపులు

5 Oct, 2022 07:26 IST|Sakshi

న్యూఢిల్లీ: ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) ద్వారా సెప్టెంబర్‌లో జరిగిన పేమెంట్ల విలువ రూ. 11 లక్షల కోట్ల స్థాయిని అధిగమించింది. 678 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

 దీని ప్రకారం ఈ ఏడాది మే నెలతో పోలిస్తే (రూ. 10,41,506 కోట్లు) జూన్‌లో యూపీఐ డిజిటల్‌ పేమెంట్లు రూ. 10,14,384 కోట్లకు స్వల్పంగా తగ్గినప్పటికీ జూలైలో రూ. 10,62,747 కోట్లకు పెరిగాయి.

 ఆగస్టులో రూ. 10.72 లక్షల కోట్ల విలువ చేసే 657.9 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. తాజా గా పండుగల సీజన్‌ అయిన అక్టోబర్, నవంబర్‌లో ఇటు విలువపరంగా అటు పరిమాణంపరంగా యూపీఐ సరికొత్త రికార్డులు నమోదు చేయొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి.  


 

మరిన్ని వార్తలు