ఎన్‌ఆర్‌ఐలకు గుడ్‌న్యూస్‌.. ఈ 10 దేశాల వారికే అవకాశం!

12 Jan, 2023 10:16 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎన్‌ఆర్‌ఐలకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) సంతోషకర వార్త చెప్పింది. యూఎస్, కెనడా, యూఏఈ తదితర పది దేశాల్లోని వారు యూపీఐ ప్లాట్‌ఫామ్‌ ద్వారా నిధులను బదిలీ చేసుకోవచ్చని ఎన్‌పీసీఐ ప్రకటించింది. ఎన్‌ఆర్‌ఈ/ఎన్‌ఆర్‌వో ఖాతాలకు అనుసంధానంగా యూపీఐ ద్వారా నగదు బదిలీని చేసుకోవచ్చు. ఏప్రిల్‌ 30 నాటికి ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని యూపీఐ భాగస్వాములను ఎన్‌పీసీఐ కోరింది.

సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, హాంగ్‌కాంగ్, ఒమన్, ఖతార్, యూఎస్‌ఏ, సౌదీ అరేబియా, యూఏఈ, యూకేలోని ప్రవాస భారతీయులకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ పది దేశాల టెలికం కోడ్‌పై యూపీఐ పనిచేసే ఏర్పాటును తీసుకువస్తున్నట్టు, సమీప భవిష్యత్తులో ఇతర దేశాలకూ దీన్ని విస్తరించనున్నట్టు ఎన్‌పీసీఐ తెలిపింది. ఎన్‌ఆర్‌ఐలు భారత్‌కు వచ్చినప్పుడు చెల్లింపులు, నగదు బదిలీ చేసుకునే సౌకర్యం ఇందులో ఉంటుందని ఎన్‌పీసీఐ చైర్మన్‌ విశ్వాస్‌ పటేల్‌ పేర్కొన్నారు.

చదవండి: ఆటో ఎక్స్‌పో 2023: ఎలక్ట్రిక్‌ వాహనాలే హైలైట్‌, 5 మోడళ్లు ప్రపంచంలో తొలిసారి

మరిన్ని వార్తలు