అందుబాటులోకి కొత్త సేవలు.. ఈ క్రెడిట్‌ కార్డ్‌తో బోలెడు లాభాలు!

18 Nov, 2022 14:06 IST|Sakshi

ఆన్‌లైన్ చెల్లింపులను మరింత ప్రోత్సాహించేందుకు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ సేవలను పొందడం కోసం మీ రూపే క్రెడిట్ కార్డ్‌ (Rupay credit card)లను భీం యాప్‌ (BHIM UPI) యాప్‌కి లింక్ చేయాల్సి ఉంటుంది. తద్వారా.. ప్రజలు ఇకపై షాపుల్లో, మాల్స్‌లో షాపింగ్‌తో పాటు మరే ఇతర బిల్లుల చెల్లింపులకు మీ క్రెడిట్ కార్డుల‌ను స్వైపింగ్ మిష‌న్ల వ‌ద్ద స్వైప్ చేయాల్సిన అవ‌స‌రం ఉండుదు. ఎలాగో తెలుసుకుందాం!

క్రెడిట్‌ కార్డ్‌ లేకపోయినా ..ఈజీగా చెల్లింపులు
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ప్రతి రంగంలోనే మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే బ్యాంకింగ్‌లోనూ భారీగానే జరిగాయి. గతంలో ఏ లావాదేవీలకైన కస్టమర్‌ నేరుగా బ్యాంకులకు వెళ్లాల్సి వచ్చేది. అయితే క్రమంగా కాలం డిజిటల్‌ యుగం వైపు అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో ఏటీఎం, క్రెడిట్‌ కార్డ్‌, ఆన్‌లైన్‌ లావాదేవీలంటూ అంతా కూర్చున్న చోటే చెల్లింపులు జరిగిపోతున్నాయి. కరోనా నుంచి ఆన్‌లైన్‌ లావాదేవీలు మరింత పెరిగాయని నివేదికలు కూడా చెప్తున్నాయి. తాజాగా ఎన్‌పీసీఐ మరో ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. మీరు చేయల్సిందల్లా..  భీం యూపీఐలో మీ రూపే క్రెడిట్ కార్డ్‌ని లింక్‌ చేయడమే. తద్వారా ఏ చెల్లింపులకైన క్రెడిట్‌ కార్డు మీ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. 

క్రెడిట్‌ కార్డు లేకుండానే కేవలం భీం యాప్‌​కి లింక్‌ చేసిన మీ యూపీఐ అకౌంట్‌తో ఈజీగా చెల్లింపులు జరుపుకోవచ్చు. ఇటీవల గణనీయంగా పెరుగుతున్న క్రెడిట్‌ కార్డుల వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని వల్ల క్రెడిట్ కార్డ్ పోగొట్టుకునే స‌మ‌స్య ఇకపై ఉండదు. చెల్లింపులు కూడా చాలా సులభతరం కానున్నాయి.

ఈ బ్యాంకులకు మాత్రమే..
కేవలం కొన్ని బ్యాంకులకు మాత్ర‌మే భీమ్ యాప్ ద్వారా రూపే క్రెడిట్ కార్డు ఉపయోగానికి ఆర్బీఐ అనుమ‌తి ఇచ్చింది. అందులో పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌, యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియ‌న్ బ్యాంక్ ఖాతాదారుల‌కు మాత్ర‌మే తొలుత భీం యాప్‌తో రూపె క్రెడిట్ కార్డు సేవలను ఉపయోగించగలరు. ఈ మేర‌కు గ‌త సెప్టెంబ‌ర్ 20న ఎన్పీసీఐ స‌ర్క్యుల‌ర్ జారీ చేసింది.

చదవండి: ఎలాన్‌ మస్క్‌కు భారీ ఝలకిచ్చిన ఉద్యోగులు.. ఇప్పుడేం చేస్తావ్‌!

మరిన్ని వార్తలు