యూపీఎల్‌లో నాలుగు దిగ్గజాల పెట్టుబడులు

22 Oct, 2022 01:16 IST|Sakshi

రూ. 4,040 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తున్న ఏడీఐఏ, బ్రూక్‌ఫీల్డ్, టీపీజీ

న్యూఢిల్లీ: ఆగ్రోకెమికల్‌ దిగ్గజం యూపీఎల్‌లో నాలుగు అంతర్జాతీయ సంస్థలు మైనారిటీ వాటాలు కొనుగోలు చేస్తున్నాయి. యూపీఎల్‌ ప్రకటన ప్రకారం ఇందుకోసం అబు దాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ (ఏడీఐఏ), బ్రూక్‌ఫీల్డ్, కేకేఆర్, టీపీజీ వేర్వేరుగా రూ. 4,040 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తున్నాయి. అగ్రి–టెక్‌ ప్లాట్‌ఫాం యూపీఎల్‌ ఎస్‌ఏఎస్‌లో ఏడీఐఏ, బ్రూక్‌ఫీల్డ్, టీపీజీ 9.09 శాతం వాటాల కోసం 200 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 1,580 కోట్లు) ఇన్వెస్ట్‌ చేస్తున్నాయి.

దీనికోసం యూపీఎల్‌ ఎస్‌ఏఎస్‌ ఈక్విటీ వేల్యుయేషన్‌ను 2.2 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 17,380 కోట్లు)గా లెక్కకట్టారు. ఇక, 2.25 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. రూ. 18,450 కోట్లు) వేల్యుయేషన్‌తో ’అడ్వాంటా ఎంటర్‌ప్రైజెస్‌ – గ్లోబల్‌ సీడ్స్‌ ప్లాట్‌ఫాం’లో కేకేఆర్‌ రూ. 2,460 కోట్లు (300 మిలియన్‌ డాలర్లు) ఇన్వెస్ట్‌ చేస్తోంది. మరోవైపు, గ్లోబల్‌ క్రాప్‌ ప్రొటెక్షన్‌ ప్లాట్‌ఫాంగా వ్యవహరించే యూపీఎల్‌ కేమ్యాన్‌లో ఏడీఐఏ, టీపీజీ 22.2 శాతం కొనుగోలు చేస్తున్నాయి. అయితే, ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలు వెల్లడి కాలేదు.

మరిన్ని వార్తలు