రెండు నెల‌ల్లో 1.80 ల‌క్ష‌ల మంది ఉద్యోగుల తొలగింపు!

14 Mar, 2023 21:59 IST|Sakshi

ఆర్ధిక మాంద్యం భయాలు ప్రపంచ దేశాల్లో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫలితంగా అమెరికాకు చెందిన కంపెనీలు గడిచిన రెండు నెలల్లో 1.80 ల‌క్ష‌ల మందిని విధుల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. జ‌న‌వ‌రిలో 1,02,943 మంది, ఫిబ్రవరిలో 77,770 మందికి పింక్‌ స్లిప్‌లు అందించినట్లు ఔట్‌ప్లేస్‌మెంట్ స‌ర్వీసెస్ సంస్థ చాలెంజ‌ర్‌, గ్రే అండ్ క్రిస్మ‌స్ నివేదిక తెలిపింది.  

ఇక ఈ తొలగింపుల్లో హెల్త్‌కేర్ ఉత్ప‌త్తుల రంగంలో ఫిబ్రవరి నెల‌లో 9749 మంది ఉద్యోగాలు కోల్పోయారు. 2023లో రిటైల్ రంగంలో 17,456 మందిని, ఫైనాన్సియ‌ల్ విభాగంలో 17,235 మంది ప్రభావితమయ్యారు. ఫిన్‌టెక్ కంపెనీలు 4675 మందిని తొలగించాయి. మీడియా రంగానికి చెందిన కంపెనీలు సైతం 9738 మందిని తొల‌గించ‌డానికి సిద్ధంగా ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.  

ఈ సందర్భంగా గ్రే అండ్ క్రిస్మ‌స్ సీనియ‌ర్ వైస్‌ప్రెసిడెంట్ ఆండ్రూ చాలెంజ‌ర్ మాట్లాడుతూ..అమెరికాలోని కంపెనీలు ఆర్థిక మాంద్యంతో త‌లెత్తే విప‌త్క‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతున్నాయ‌ని అన్నారు. ఇత‌ర రంగాల్లో ఖ‌ర్చులు త‌గ్గించుకోవ‌డంతోపాటు, ప‌రిస్థితులు చేయిదాటితే ఉద్యోగుల తొల‌గింపుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు