StockMarketClosing ఫెడ్‌ దెబ్బ, ఐటీ డౌన్‌, బ్యాంకింగ్‌ షైన్‌

3 Nov, 2022 15:50 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిసాయి. ఫెడ్‌  వడ్డీ రేటు పెంపుతో ఆరంభంలోనే నెగిటివ్‌గా ఉన్నప్పటికీ వెంటనే ప్రధాన సూచీలు  లాభాల్లోకి మళ్లాయి.   రోజాంతా లాభ నష్టాల మధ్య ఊగిసలాడి,  చివరికి సెన్సెక్స్‌ 70  పాయింట్లు కోల్పోయి  60836 వద్ద, నిఫ్టీ 30 పాయింట్లు  లాభంతో 18053  వద్ద  ముగిసాయి.    నిఫ్టీ 18వేలకు ఎగువన, సెన్సెక్స్‌ 60 వేలకు ఎగువన స్థిరంగా ఉన్నాయి.

ఐటీ, కన్జూమర్‌ డ్యూరబుల్‌ షేర్లు నష్టపోగా, బ్యాంకింగ్‌ షేర్లు లాభపడ్డాయి. ఎస్‌బీఐ, టైటన్‌, యూపీఎల్‌, భారతీ  ఎయిర్టెల్‌, హెచ్‌యూఎల్‌ లాభపడగా,  టెక్‌ మహీంద్ర, హిందాల్కో, పవర్‌ గ్రిడ్‌, ఐషర్‌ మోటార్స్‌, ఎన్టీపీసీ నష్టపోయాయి. అటు డాలరు మారకంలో 12 పైసలు క్షీణించి 82.88  వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు