క్యూ2లో అమెరికా ఆర్థిక వ్యవస్థ భారీ క్షీణత

31 Jul, 2020 06:42 IST|Sakshi

జీడీపీ  మైనస్‌ 32.9% డౌన్‌

1947 తరువాత ఇదే ఘోర పతనం

వాషింగ్టన్‌: కరోనా ప్రభావంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ 2020 రెండవ త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) భారీగా మైనస్‌ 32.9 శాతం క్షీణించింది. 1947 తర్వాత అగ్రరాజ్య స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఈ స్థాయిలో క్షీణించడం ఇదే తొలిసారి. 1958లో 10 శాతం క్షీణత నమోదయ్యింది. జనవరి–మార్చి మధ్య కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థ మైనస్‌ 5 శాతం క్షీణతను నమోదుచేసుకుంది.

వరుసగా రెండు త్రైమాసికాలు క్షీణత నమోదయినందున దీనిని అధికారికంగా మాంద్యంగానే పరిగణించాల్సి ఉంటుంది. 11 సంవత్సరాల వృద్ధి తర్వాత అమెరికా ఈ తరహా పరిస్థితిని ఎదుర్కొంటోంది. కరోనా వైరస్‌ ప్రభావం నుంచి ఇంకా దేశం కోలుకోలేదు. వ్యాపారాలు దెబ్బతినడం, ఉపాధి కోల్పోవడం వంటి సవాళ్లు దేశంలో కొనసాగుతున్నాయి. జీడీపీ భారీ పతనం, అధ్యక్షుడు ట్రంప్‌ ఇచ్చిన అమెరికా అధ్యక్ష ఎన్నికల వాయిదా సంకేతాల నేపథ్యంలో వాల్‌స్ట్రీట్‌ భారీ నష్టాల్లోకి జారిపోయింది.  

మరిన్ని వార్తలు