బైడెన్‌ అలా చేస్తాడా? చైనాకు దాసోహం అంటాడా?

6 Jun, 2022 15:01 IST|Sakshi


ప్రపంచంలో ఏ మూల సమస్య వచ్చినా రాకున్నా నేనున్నానంటూ తలదూర్చే అమెరికాకు ద్రవ్యోల్బణం మింగుడుపడటం లేదు.  ఆయధ శక్తిలో ఆర్థిక సంపత్తితో  ప్రపంచ పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికాకు ద్రవ్యో‍ల్బణం చుక్కలు చూపిస్తోంది. దీంతో వివిధ దేశాలపై విధించిన కఠిన ఆంక్షల విషయంలో పట్టువిడుపు ధోరణితో ఉంటే ఎలా ఉంటుందనే అంశాన్ని ఆ దేశ అధ్యక్షుడు జోబైడెన్‌ సీరియస్‌గా పరిశీలిస్తున్నారు. 
            
నలభై ఏళ్లలో ఎన్నడూ చూడని గరిష్ట స్థాయిలో అమెరికాలో ద్రవ్యోల్బణం కొనసాగుతోంది. ధరలు భగ్గుమంటున్నాయి. ద్రవ్యోల్బణ కట్టడికి అవసరమైతే చైనాపై విధించిన ఆంక్షల్లో కొన్నింటికి మినహాయింపులు ఇచ్చే అంశాన్ని ఆ దేశం తీవ్రంగా పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని ఆ యూఎస్‌ కామర్స్‌ సెక్రటరీ జినా రైమాండో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 

ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక శక్తులుగా అమెరికా, చైనాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ తరుణంలో వివిధ కారణాలతో 2018,19లో చైనా దిగుమతులపై తీవ్ర ఆంక్షలు విధించారు అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. ఇప్పటికీ ఆ ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే అమెరికాలో ద్రవ్యోల్బణం తారా స్థాయికి చేరడంతో చీప్‌గా వచ్చే చైనా వస్తువులు దిగుమతి చేసుకోవడం ద్వారా ధరల భారం నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించే అవకాశం ఏమైనా ఉందేమో పరిశీలించాలంటూ జోబైడెన్‌ తమను ఆదేశించినట్టు రైమాండో తెలిపారు.

అమెరికా అధ్యక్షుడి సూచనల మేరకు కొన్ని తాము ప్రతిపాదనలు తయారు చేశామని రైమాండో వివరించారు. దేశీ పరిశ్రమలను కాపాడే లక్ష్యంతో స్టీలు, అల్యూమినియం వంటి వాటిపై ఆంక్షలు కొనసాగించాలని సూచించినట్టు తెలిపారు. అయితే పుడ్‌, సైకిళ్లు వంటి విభాగాల్లో ఆంక్షలు సడిలించే అంశాన్ని పరిశీలించాలని కోరినట్టు వెల్లడించారు. అయితే తాము కేవలం చూనలు చేశామని, తుది నిర్ణయం అధ్యక్షుడు జో బైడెన్‌ తీసుకుంటారని రైమాండో వెల్లడించారు. 

చదవండి: ప్రపంచంలోనే తొలిసారిగా ‘రైట్‌ టూ రిపేర్‌’ యాక్ట్‌

మరిన్ని వార్తలు