యూఎస్‌ వీసా: అన్నంత పని చేసిన అమెరికా, ఈ వీడియోతో దిల్‌ ఖుష్‌!

1 Mar, 2023 12:37 IST|Sakshi

న్యూఢిల్లీ:  భారతీయులకు వీసాను మరింత దగ్గరిచేసే క్రమంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీసా జారీ కోసం వేచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గించే చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా  ముంబైలో వీసా కార్యకలాపాల సహాయం నిమిత్తం అమెరికా తాత్కాలిక వీసా అధికారులను నియమించింది.  ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కాన్సులర్ అధికారులు పనిచేస్తున్నారని, దీన్ని  ఉపయోగించుకోవాలని  యుఎస్ కాన్సులేట్  తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా  ఉన్న  కీలక అధికారులు తమ సాధారణ విధులను విడిచి పెట్టి మరీ  ఈ విధుల్లో చేరారని ముంబైలోని యూఎస్ కాన్సులేట్ ఒక ట్వీట్‌లో తెలిపింది.(StudentVisa అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు అదిరిపోయే న్యూస్‌!)

వీసా వెయిటింగ్‌ సమయాన్ని తగ్గించేందుకు వీరంతా  ఒక్కటయ్యారు అని ట్వీట్‌ చేసిది. దీనికి సంబంధించి ముంబైలో వీసా కాన్సులర్ ఆఫీసులో ఉన్న టాప్‌ అధికారుల బృందంతో ఒక వీడియోను షేర్‌ చేసింది. వాషింగ్టన్ డీసీ,  జపాన్‌లోని ఒకినావా , హాంకాంగ్‌ నుంచి ఎంపిక చేసిన నలుగురు అధికారులను ఈ  వీడియోలో చూడొచ్చు. వీసా ఇంటర్వ్యూ నిరీక్షణ సమయాన్ని తగ్గించి, అమెరికా ప్రయాణాన్ని సులభం చేయడం, భారతదేశం-యుఎస్ వ్యాపార అవకాశాలను పెంపు,  కుటుంబ పునరేకీకరణ లాంటి సమస్యల పరిష్కారానికి మద్దతు వంటి బాధ్యతలను ఈ అధికారులకు అప్పగించారు. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక బృందాన్ని  ఏర్పాటు చేయనున్నామని గతంలో యూఎస్‌ సర్కార్‌ ప్రకటించింది. అలాగే అమెరికాలో చదువు కోవాలనుకునే విద్యార్థులకు ఏడాది ముందుగానే వీసాకోసం దరఖాస్తు చేసుకోవచ్చని కూడా తెలిపింది. 

మరిన్ని వార్తలు