మీ ఇంట్లో ఫ్రిజ్‌ ఉందా? అయితే ఈ పరికరం ఉండాల్సిందే!

24 Jul, 2022 16:50 IST|Sakshi

బయట ఉంచినప్పటి కంటే ఫ్రిజ్‌లో ఉంచితే ఆహార పదార్థాలు, పానీయాలు మరింత ఎక్కువకాలం తాజాగా ఉంటాయని తెలిసిందే. ఫ్రిజ్‌లో కూడా కొంత పరిమితి వరకే ఇవి తాజాగా ఉంటాయి. ఫ్రిజ్‌లో ఆహార పదార్థాలు, పానీయాల తాజాదనం పరిమితిని మరింత పెంచడానికి ఒక బుల్లిసాధనం అందుబాటులోకి వచ్చింది. ఫొటోలో కనిపిస్తున్నది అదే! ‘ప్యూర్‌ ఎయిర్‌ ఫ్రిజ్‌ ఫుడ్‌ లైఫ్‌ ఎక్స్‌టెండర్‌’ పేరిట అమెరికాకు చెందిన ‘గ్రీన్‌టెక్‌ ఎన్విరాన్‌మెంటల్‌’ సంస్థ రూపొందించిన ఈ బుల్లి పరికరాన్ని ఫ్రిజ్‌లో ఉంచితే చాలు, ఫ్రిజ్‌లోని ఆహార పదార్థాలు, పానీయాలు మూడువారాల పాటు ఏమాత్రం చెడిపోకుండా నిక్షేపంగా తాజాగా ఉంటాయి.

‘ప్యూర్‌ ఎయిర్‌’ లీథియం అయాన్‌ బ్యాటరీతో పనిచేస్తుంది. దీనిని మూడు వారాలకు ఒకసారి చార్జింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రిజ్‌లోని పదార్థాలను తాజాగా ఉంచడమే కాకుండా, ఇది ఫ్రిజ్‌లోని గాలిని శుభ్రపరుస్తుంది కూడా. ఇందులోని అయానైజేషన్, యాక్టివేటెడ్‌ ఆక్సిజన్‌ టెక్నాలజీ ఫ్రిజ్‌లో వెలువడే ఈథెలిన్‌ గ్యాస్‌ను ఎప్పటికప్పుడు తగ్గించేస్తుంది. ఫలితంగా ఫ్రిజ్‌లో నిల్వ చేసిన పదార్థాలు మరింత ఎక్కువకాలం తాజాగా ఉంటాయి. ఆహార పదార్థాల వృథాను ఈ పరికరం గణనీయంగా అరికట్టగలదని దీని తయారీదారులు చెబుతున్నారు.

చదవండి: Coding Contest: టెన్త్‌ క్లాస్‌ కుర్రాడికి బంపరాఫర్‌, భారీ ప్యాకేజ్‌తో పిలిచి ఐటీ జాబ్‌ ఇస్తామంటే!

మరిన్ని వార్తలు