చమురు సరఫరాలో సౌదీని మించిన అమెరికా!

16 Mar, 2021 15:24 IST|Sakshi

న్యూఢిల్లీ: మ‌న‌దేశ ఇంధ‌న అవ‌స‌రాల‌కు స‌రిప‌డా ముడి చ‌మురు స‌ర‌ఫ‌రా చేస్తున్న దేశాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు సౌదీ అరేబియా రెండో స్థానంలో కొనసాగేది. కానీ ప్రస్తుతం సౌదీ అరేబియా ఆ స్థానాన్ని కోల్పోనున్న‌ది. సౌదీ అరేబియా స్థానాన్ని అమెరికా భ‌ర్తీ చేయ‌నున్న‌ది. సౌదీ అరేబియా సార‌ధ్యంలోని ఒపెక్ ప్ల‌స్ దేశాల కూట‌మి ముడి చ‌మురు ఉత్ప‌త్తిని త‌గ్గించ‌డంతో భారత్, అమెరికా నుంచి ఎక్కువ మొత్తంలో ముడి చ‌మురును కొనుగోలు చేస్తున్నది. దీనితో భారత్‌కు అత్యధికంగా చమురు ఎగుమతి చేస్తున్న రెండో దేశంగా అమెరికా అవతరించింది. 

గత నెలలో ఈ స్థానంలో ఉన్న సౌదీ అరేబియాను ఇప్పుడు అగ్రరాజ్యం అధిగమించింది. అమెరికాలో ముడి చమురు డిమాండ్ పడిపోవడంతో పాటు తక్కువ ధరకు లభించడంతో భారత్ ఎక్కువ మొత్తంలో చమురును కొనుగోలుచేస్తున్నది. మరోపక్క చమురు ఉత్పత్తి దేశాలు(ఒపెక్‌ ప్లస్) రోజుకి ఒక మిలియన్‌ బ్యారెళ్ల ఉత్పత్తిని తగ్గించాలని‌ దేశాలు నిర్ణయించాయి. ప్రస్తుతం అమెరికానే ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా ఉంది. అమెరికా నుంచి భారతదేశం దిగుమతులు 48 శాతం పెరిగి గత నెలలో ఫిబ్రవరిలో 545,300 బ్యారెల్స్(బిపిడి)కు చేరుకున్నాయి. గత నెల భారతదేశం మొత్తం దిగుమతుల్లో అమెరికా వాటా 14 శాతం ఉంది.

దీనికి విరుద్ధంగా, ఫిబ్రవరిలో సౌదీ అరేబియా నుంచి దిగుమతులు 42 శాతం తగ్గి రోజుకి 4,45,200 బ్యారెళ్ల చమురు దశాబ్ద కనిష్టానికి పడిపోయాయి. 2006 జనవరి తర్వాత భారత్‌కు చమురు ఎగుమతి చేస్తున్న జాబితాలో మొదటిసారిగా 4వ స్థానానికి పడిపోయింది. భారత్‌కు చమురు ఎగుమతి చేస్తున్న అతిపెద్ద దేశంగా ఇరాక్‌ కొనసాగుతోంది. మొత్తంగా చూస్తే ఆ దేశం నుంచి భారత్‌కు చమురు ఉత్పత్తి 23 శాతం పడిపోయి ఐదు నెలల కనిష్ఠానికి చేరింది. 

చదవండి:

కరోనా కాలంలో ఎగుమతుల జోరు‌

మరిన్ని వార్తలు