భారత్‌లో అపార అవకాశాలు

15 Oct, 2021 04:13 IST|Sakshi

ఇన్వెస్ట్‌ చేసేందుకు ముందుకు రండి

అమెరికా సంస్థలకు కేంద్ర మంత్రి సీతారామన్‌ ఆహా్వనం

వాషింగ్టన్‌: ఇన్వెస్టర్లు, వ్యాపార సంస్థలకు భారత్‌లో అపార అవకాశాలు ఉన్నాయని అమెరికన్‌ కార్పొరేట్‌ దిగ్గజాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. స్వావలంబన దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పలు పథకాల గురించి వివరించారు. ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలు మరింతగా పెట్టుబడులు పెట్టాలని, కొత్త కంపెనీలు.. మదుపుదారులు ఇన్వెస్ట్‌ చేయడానికి ముందుకు రావాలని ఆమె ఆహా్వనించారు.

అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంక్‌ వార్షిక సదస్సుల్లో పాల్గొనేందుకు అమెరికాలో పర్యటిస్తున్న సందర్భంగా పలు బహుళ జాతి దిగ్గజాల సీఈవోలతో నిర్మలా సీతారామన్‌ వరుసగా భేటీ అవుతున్నారు. ఆమ్‌వే సీఈవో మిలింద్‌ పంత్‌తో సమావేశమైన సందర్భంగా తయారీ రంగంలో ఆటోమేషన్, పరిశోధన.. అభివృద్ధి కార్యకలాపాలు వంటి అంశాలపై ఆమె చర్చించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. విమానాల తయారీ దిగ్గజం బోయింగ్‌ చీఫ్‌ స్ట్రాటెజీ ఆఫీసర్‌ బి మార్క్‌ అలెన్‌తో భేటీలో నవకల్పనలు, ఏరోస్పేస్‌ రంగంలో అవకాశాల గురించి ప్రస్తావించారు.
     

>
మరిన్ని వార్తలు