ఉత్తమ్‌ గాల్వాకు తగ్గిన నష్టాలు

23 May, 2022 01:11 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ మెటల్స్‌ కంపెనీ ఉత్తమ్‌ గాల్వా స్టీల్స్‌ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర నష్టం భారీగా తగ్గి రూ. 26 కోట్లకు పరిమితమైంది.

అంతక్రితం ఏడాది(2020–21) ఇ దే కాలంలో రూ. 68 కోట్ల నికర నష్టం నమోదైంది. క్యూ4లో కోల్డ్‌ రోల్డ్, గాల్వనైజ్‌డ్‌ స్టీల్‌ తయారీకి కంపెనీ ఆదాయం సైతం రూ. 197 కోట్ల నుంచి రూ. 252 కోట్లకు బలపడింది. మొత్తం వ్యయాలు రూ. 264 కోట్ల నుంచి రూ. 278 కోట్లకు పెరిగాయి.

మరిన్ని వార్తలు