18 ఏళ్లు పైబడినవారి వ్యాక్సినేషన్‌కు 67,193 కోట్లు!

23 Apr, 2021 01:43 IST|Sakshi

ఇండియా రేటింగ్స్‌ అంచనా  

న్యూఢిల్లీ: దేశంలో 18 సంవత్సరాలు పైబడినవారికి కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ప్రభుత్వాలకు రూ.67,193 కోట్లు ఖర్చవుతుందని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఇండ్‌–రా) గురువారంనాటి తన తాజా నివేదికలో పేర్కొంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాల వాటా రూ.46,323 కోట్లుగా ఉంటుందని, కేంద్రం వ్యయం రూ.20,870 కోట్లని విశ్లేషించింది. ఈ మొత్తం కలుపుకుంటే స్థూల దేశీయోత్పత్తిపై (జీడీపీ) వ్యాక్సినేషన్‌ వ్యయ భారం కేవలం 0.36 శాతంగా ఉంటుందని పేర్కొంది. 18 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కిందకు (మొత్తం దేశ జనాభా 133.26 కోట్ల మందిలో) 84.19 కోట్ల మంది వస్తారని తన తాజా విశ్లేషణా పత్రంలో పేర్కొంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు